రాష్ట్రీయం

ఉగ్రనారసింహునికి భక్తజన నీరాజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, మార్చి 10: గోదావరీ తీరస్థ పుణ్యక్షేత్రమైన ధర్మపురిలో సనాతన సంప్రదాయరీతిలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన శనివారం జరిగిన శ్రీ ఉగ్రనారసింహుని ఏకాంతోత్సవ వేడుకలకు భక్తులు అశేష భక్తులు విచ్చేశారు. ఉదయాత్పూర్వం ఉగ్ర లక్ష్మీ నారసింహ ఆలయాన్ని తెరవగా, సంప్రోక్షణం చేసిన అనంతరం దేవస్థానం వంశపారంపర్య యాజ్ఞికులు కందాళై పురుషోత్తమాచార్య, ఆస్థాన వేదపండితులు బొజ్జా రమేశ శర్మ, ముత్యాల శర్మ, ప్రధాన అర్చకులు నంబి రఘునాథాచార్య, నరసింహమూర్తి, దేవస్థానం ఎసి,ఇఓ నాయిని సుప్రియ, డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి నేతృత్వంలోని దేవస్థానం కమిటీ బాధ్యుల పర్యవేక్షణలో, భక్తుల గోత్రనామయుక్త పూజలు, నిత్య అర్చనలు, నిత్య కల్యాణంతో పాటు ఉత్సవ ముగింపు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మొక్కులు తీర్చుకున్న భక్తజనావళి
పరమపవిత్ర గోదావరినదిలో మంగళ స్నానాలు ఆచరించిన భక్తులు, సుప్రభాత దర్శనానికి వివిధ ఆలయాలముందు బారులుతీరి నిలుచున్నారు. కోరిన కోర్కెలు తీర్చే వరదుడుగా వినతికెక్కిన ఉగ్రనారసింహునికి ముడుపులు చెల్లించి మొక్కులు తీర్చుకున్నారు. ఒక కనుములో కొబ్బరికాయ, ఖర్జూరపు పండ్లు, పోకలు, మొక్కులు కలిపి కట్టి లక్ష్మీసమేత నారసింహుని సన్నిధిలో ఉంచడం ద్వారా కోర్కెలన్నీ నెరవేరగలవని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ క్రమంలోనే శనివారం అత్యధిక సంఖ్యలో భక్తులు ఆలయంలో ముడుపులు కట్టి, వల్లుబండ, గండాదీపాది మొక్కులు తీర్చుకున్నారు.

చిత్రం..ధర్మపురిలో శనివారం పుణ్యస్నానాలు ఆచరించి, ఉగ్ర నరసింహ స్వామిని దర్శించుకున్న భక్తులు