రాష్ట్రీయం

75 పరిషత్‌లు.. 360 ప్రదర్శనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మార్చి 10: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగరంలో ఆదివారం నుంచి రాష్టస్థ్రాయి నంది నాటకోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
ఈ నెల 28వ తేదీ వరకు నంది నాటకోత్సవాల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లుచేశారు. నాటక పోటీలలో 360 పద్య, సాంఘిక నాటకాలు, నాటికల (ఏకాంకం)ను వివిధ జిల్లాలకు చెందిన పరిషత్‌లు ప్రదర్శించనున్నాయి. కాకినాడలోని యంగ్‌మెన్స్ హ్యాపీక్లబ్‌లోని దంటు కళాక్షేత్రంలో నాటకాలు, నాటికలు ప్రదర్శిస్తారు. అలాగే ఈ నెల 14 నుంచి 22వ తేదీ వరకు రాజమహేంద్రవరంలోని ఆనం కళాకేంద్రంలో పలు నాటకాలు, నాటికలు ప్రదర్శించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నాటకోత్సవాలకు రూ.80 లక్షలు కేటాయించింది. ప్రదర్శించిన పద్య నాటకానికి రూ.30 వేలు, సాంఘిక నాటకానికి రూ.20 వేలు, సాంఘిక నాటికకు రూ.15 వేలు, బాలల నాటికకు రూ.15 వేలు, కళాశాల, విశ్వవిద్యాలయ స్థాయిల్లో ప్రదర్శించిన నాటికలకు రూ.15 వేల వంతున పారితోషికం చెల్లిస్తారు. నాటకోత్సవం ముగిసిన అనంతరం ఉత్తమ నాటికలను న్యాయ నిర్ణేతలు ఎంపికచేస్తారు. ప్రదర్శనలను నేరుగా చూడటంతో పాటు వీడియోల్లో చిత్రీకరించిన నాటికలు, నాటకాలను తిలకించిన తర్వాత న్యాయ నిర్ణేతలు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ప్రకటిస్తారు. ఉత్తమ ప్రదర్శనలు, ఉత్తమ నటులకు ముఖ్యమంత్రి చంద్రబాబు బహుమతులను అందజేస్తారు. ఆదివారం ఉదయం 10 గంటలకు నాటకోత్సవ సభను రాష్ట్ర నాటక రంగ, టీవీ, చలనచిత్రాభివృద్ధి సంస్థ ఛైర్మన్ అంబికా కృష్ణ, చలనచిత్ర, టీవీ, నాటక రంగాభివృద్ధి సంస్థ డైరెక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు, పలువురు ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తారు. వివిధ జిల్లాలకు చెందిన సుమారు 75 నాటక సమాజాలు ఈ నాటకోత్సవంలో పాల్గొంటున్నాయి. రోజూ ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి వరకు ప్రదర్శనలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. నాటకోత్సవాలను ప్రతివొక్కరు ఆదరించి రంగస్థల కళకు పూర్వవైభవం తీసుకురావాలని రాష్ట్ర నాటక రంగ, టీవీ, చలనచిత్రాభివృద్ధి సంస్థ విజ్ఞప్తి చేసింది.