రాష్ట్రీయం

ఐఈడీ బాంబు పేలి జవాన్‌కు గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం రూరల్, మార్చి 10: చత్తీస్‌గఢ్ అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న ఒక జవాన్ ఐఈడీ మందుపాతర పేలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. బీజాపూర్ జిల్లా పామేడు పోలీసు స్టేషన్ పరిధిలోని తోగ్గూడెం అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం ఎస్టీఎఫ్, బీఎస్‌ఎఫ్ బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. మావోయిస్టులు అమర్చిన మందుపాతర (ఐఈడీ బాంబు)ను పసిగట్టలేకపోయిన సూరజ్‌మండలి అనే జవాను దానిపై కాలువేశాడు. అది పేలడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని హుటాహుటిన భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు శస్తచ్రికిత్స చేస్తున్నారు. భద్రాచలం ఏఎస్పీ సునీల్‌దత్, సీఐ సత్యనారాయణరెడ్డి, ట్రాఫిక్ ఎస్సై ఎస్డీ ఖాదర్‌బాబా ఆసుపత్రికి వచ్చి జవాన్ పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తీవ్ర రక్తస్రావం కావడంతో శస్తచ్రికిత్స చేస్తున్నామని వైద్యులు వివరించారు.