రాష్ట్రీయం

భక్తుల రద్దీకి తగ్గట్టుగా ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచల క్షేత్రంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఈనెల 26న నిర్వహించనున్న వేడుకలకు సంబంధించిన ఆహ్వాన పత్రిక, గోడ పత్రికను మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
మిథిలా ప్రాంగణంలో జరిగే కల్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారని చెప్పారు. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ ప్రభాకర శ్రీనివాస శర్మ, ఖమ్మం డీసీసీబీ చైర్మన్ మువ్వ విజయబాబు పాల్గొన్నారు.
యాదాద్రి తరహాలో భద్రాద్రి పుణ్యక్షేత్ర పున నిర్మాణ పనులు చేపట్టనున్నట్టు మంత్రులు తెలిపారు. ఉగాది పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, త్రిదండి చిన్నజీయర్‌స్వామిలతో సంప్రదించి ఆలయ అభివృద్థి పనులను ప్రారంభించనున్నట్టు తెలిపారు.
శ్రీ సీతారామచంద్ర స్వామి పట్ట్భాషేకాన్ని పురస్కరించుకొని ఈనెల 27న ఆలయ అభివృద్థి పనులకు శ్రీకారం చుట్టనున్నట్టు ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఈ విషయమై ఉగాది పర్వదినాన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, త్రిదండి శ్రీ చిన్నజీయర్ స్వామితో సంప్రదించనున్నట్టు చెప్పారు. యాదాద్రి తరహాలో భద్రాద్రి ఆలయాన్ని అభివృద్థి చేసేందుకు ఇప్పటికే ముఖ్యమంత్రి రూ.100 కోట్లు కేటాయించారని, ఈ నిధులతో ఆలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దనున్నట్టు చెప్పారు.
చిత్రం..భద్రాద్రి సీతారాముల కల్యాణ ఆహ్వాన పత్రిక, పోస్టర్లను ఆవిష్కరిస్తున్న
మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు