రాష్ట్రీయం

ఢిల్లీ చక్రం తిప్పుతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 11: త్వరలోనే జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టి కీలక పాత్ర పోషించనున్నట్లు తెలంగాణ సీఎం కే. చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు. తాను హైదరాబాద్‌లోనే ఉంటానని, అయినా జాతీయ రాజకీయాల్లో ముఖ్య భూమిక పోషిస్తానని తన నిర్ణయాన్ని ప్రకటించారు. భారత రాజకీయాలకు అద్భుతమైన దిశా నిర్ధేశం చూపించి, ప్రజానికీకానికి మార్గ నిర్ధేశనం చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆదివారం పార్టీ కార్యాలయంలో కేసీఆర్ అధ్యక్షతన తెరాసఎల్పీ సమావేశం జరిగింది. సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఇలాగే కొనసాగితే, దేశం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొవాల్సి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దళితులకు, గిరిజనులకు, రైతులకు సేవ చేయాల్సిన అవసరం ఉందని లోగడ తాను ప్రధాని మోదీతో అన్నానని గుర్తు చేశారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఢిల్లీ వెళతానని, రిజర్వేషన్ల అంశంపై కేంద్రంపై వత్తిడి తీసుకుని వస్తామని అన్నారు. అవసరమైతే పార్టీ ఎంపీలతో కలిసి ధర్నాలో పాల్గొంటానని కేసీఆర్ వెల్లడించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయ. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 106 స్థానాల్లో విజయం సాధిస్తామని తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు. సిట్టింగ్‌లందరికీ సీట్లు ఇచ్చి, వారిని గెలిపించుకుంటానని భరోసా ఇచ్చారు. వచ్చే ఎన్నికలపై తాను సర్వే చేయించానని చెప్పారు. ఒక్క సంస్థతో కాదు మూడు వేర్వేరు సంస్థలతో సర్వే చేయించినా, 106 స్థానాలూ తెరాసకే దక్కుతాయని వచ్చిందన్నారు. ఇప్పుడు ఉన్న సిట్టింగ్‌లందరికీ తిరిగి టిక్కెట్లు ఇస్తామని, వారందరినీ గెలిపించుకుంటానని తెలిపారు.