రాష్ట్రీయం

సమరానికి సన్నద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 11: రాష్ట్ర శాసనసభ, శాసనమండలి బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్ధేశించి గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ప్రసంగిస్తారు. ఎన్నికలకు ఏడాది మాత్రమే గడువున్నందున సభలను వేదిక చేసుకునేందుకు పాలక, ప్రతిపక్షాలు వ్యూహ ప్రతివ్యూహాలతో సన్నద్ధమవుతున్నాయి. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నించనున్నట్లు సమాచారం. అలాగే, ప్రతి రోజూ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి ప్రజలను ఆకర్షించాలని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్‌పి) నిర్ణయించింది. అయితే ఎన్నికలకు ముందు ఇదే పూర్తిస్థాయి బడ్జెట్ కాబట్టి ప్రజాకర్షక బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం సంసిద్ధమైంది. షెడ్యూలు ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్, మేలో ఎన్నికలు జరుగుతాయి. ఆ సమయంలో ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టేందుకు అవకాశం లేదు కాబట్టి, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను మాత్రమే ప్రవేశపెట్టి ఆమోదిస్తుంది. అంటే ఆరు నెలల కోసమే బడ్జెట్ పెడుతుంది. చివరి బడ్జెట్‌లో ప్రజాకర్షక పథకాలతో ప్రజలకు మరింత చేరువ కావలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ ఉన్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమవుతూ బడ్జెట్ తయారీలో బిజీ బిజీగా ఉన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రతిపక్షాలు చేసే నిరాధార ఆరోపణలు, విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని సీఎం కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు. ప్రతి రోజూ ఎమ్మెల్యేలంతా సమావేశాలకు హాజరుకావాలని, సభలోనే ఉండాలని ఆయన ఆదేశించారు.
25 అస్త్రాలతో కాంగ్రెస్
ఇలాఉండగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ 25 అస్త్రాలతో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సమాయత్తమైంది. రెండు రోజుల క్రితం జరిగిన సీఎల్పీ భేటీలో ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు ప్రజా సమస్యలను, ప్రభుత్వం నెరవేర్చని హామీలను సిద్ధం చేసుకుంది. ముఖ్యంగా డబుల్ బెడ్ రూం ఇళ్లు, రైతులకు గిట్టుబాటు ధర లభించకపోవడం, ఆగిన రైతుల ఆత్మహత్యలు, ఫీజు రీయంబర్స్‌మెంట్, నీటి పారుదలరంగంలో అవినీతి, ముస్లింలకు, గిరిజనులకు కల్పిస్తామన్న రిజర్వేషన్లపై ప్రభుత్వం విఫలం కావడం వంటి అనేక సమస్యలతో జాబితా రూపొందించింది. మరోవైపు బీజేపీ సైతం ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సమాయత్తమైంది. దీంతో సుమారు నెలపాటు జరిగే బడ్జెట్ సమావేశాలు ప్రతి రోజూ హాట్ హాట్‌గా జరిగే అవకాశం కనిపిస్తోంది.
బీఏసీ సమావేశాలు
సోమవారం గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి అధ్యక్షతన శాసనసభా వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశంకానుంది. సమావేశానికి సీఎం కేసీఆర్, విపక్షాల శాసనసభాపక్షం నేతలు హాజరవుతారు. ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలి, ఏయే అంశాలను ప్రాధాన్యత క్రమంలో చర్చకు చేపట్టాలన్న అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. తర్వాత శాసనమండలి చైర్మన్ కె. స్వామిగౌడ్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరుగుతుంది.