రాష్ట్రీయం

కోమటిరెడ్డి, సంపత్‌పై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 13: ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించిన సమయంలో కాంగ్రెస్ సభ్యులు విసిరిన హెడ్‌ఫోన్ తగిలి శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి దెబ్బతగిలిన ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు శాసనసభ వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు మంగళవారం శాసనసభ సమావేశంకాగానే ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ల శాసనసభ సభ్యత్వం రద్దు చేస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని శాసనసభ మూజువోణి ఓటుతో ఆమోదించింది. గవర్నర్ ప్రసంగం సందర్భంగా నిరసన తెలిపిన మరో 11మంది కాంగ్రెస్ సభ్యులను శాసనసభ నుండి బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకూ స్పీకర్ మధుసూధనాచారి సస్పెండ్ చేశారు. సస్పెండైన వారిలో జానారెడ్డి, గీతారెడ్డి, చిన్నారెడ్డి, ఉత్తమకుమార్‌రెడ్డి, మాధవరెడ్డి, డికె అరుణ, భట్టి విక్రమార్క, రామమోహన్‌రెడ్డి, వంశీచంద్‌రెడ్డి, పద్మావతి రెడ్డిలు ఉన్నారు. అనంతరం సభ్యులు సభను వీడాలని స్పీకర్ మధుసూధనాచారి కోరారు. మండలి చైర్మన్‌పై జరిగిన దాడిని చూసి తాను షాక్‌కు గురయ్యానన్నారు. ఈ ఘటన చాలా దుర్మార్గమైన హేయమైన చర్యగా అభివర్ణించారు. నాలుగేళ్ల తెలంగాణ శాసనసభ చరిత్రలో ఈ ఘటన ఓ మచ్చగా మిగిలిపోతుందన్నారు. మాటల్లో వర్ణించలేని ఆవేదన తన మనసులో ఉందని, తాము వేసిన శిక్ష చాలా చిన్నదేనని స్పీకర్ వ్యాఖ్యానించారు. క్లిప్పింగ్స్ అన్నీ చూసిన తరువాత కావాలనే ఉద్ధేశ్యపూర్వకంగా కొంతమంది ఇలా చేశారనే నిర్ణయానికి వచ్చామన్నారు. అంతకుముందు మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ నిన్నటి అరాచక చర్యను తీవ్రంగా ఖండించారు. సమావేశాలు ముగిసే వరకూ కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేయాలని
కోరుతున్నట్టు పేర్కొన్నారు. తాను హెడ్‌ఫోన్స్‌ను ఎవరి టార్గెట్‌గానో విసరలేదని, తాను విసిరిన హెడ్‌ఫోన్స్ స్వామిగౌడ్‌కు తగిలినట్టు సాక్ష్యం చూపితే రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటానని కోమటిరెడ్డి వెల్లడించినా తెరాస పట్టించుకోలేదు. స్వామిగౌడ్‌కు హెడ్‌ఫోన్స్ తగిలిన దృశ్యాలు లేవని కాంగ్రెస్ నేతలు వాదించారు. అయితే సభ నుంచి సభ్యులు బయటకు వెళ్లాలని, లేకుంటే మార్షల్స్‌ను పిలవాల్సి వస్తుందని స్పీకర్ హెచ్చరించారు. తమను మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేయగా స్పీకర్ నిరాకరించారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ సభ సరైన నిర్ణయం తీసుకుందన్నారు. తాను గవర్నర్‌ను టార్గెట్ చేయబోతే హెడ్‌ఫోన్స్ గురితప్పి స్వామిగౌడ్‌ను తగిలాయని కోమటిరెడ్డి చెప్పడం దారుణమన్నారు. ఇటువంటి వ్యక్తులు సభలో ఉండాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ అన్నారు.
మండలిలో ఆరుగురు సస్పెన్షన్
అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు గవర్నర్ ప్రసంగం సందర్భంగా చోటుచేసుకున్న సెగ మంగళవారం మండలికీ తాకింది. సభ ప్రారంభమైన పది నిమిషాల్లోపే కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు సభ్యులను సస్పెండ్ చేయాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కోరారు. దీంతో షబ్బీర్ అలి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఆకుల లలిత, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, దామోదర్ రెడ్డి, సంతోష్‌లను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ రావు ప్రకటించారు.

చిత్రం..కాంగ్రెస్ వైఖరిపై సభలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్