రాష్ట్రీయం

ప్రతిపక్షపాత్రా మనదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 14: రాష్ట్రంలో ఇకపై ప్రతిపక్ష పాత్ర కూడా తెలుగుదేశం పార్టీనే పోషించాలని ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. బుధవారం జరిగిన పార్టీ సమన్వయ కమిటీలో ఆయన ఎమ్మెల్యేలు, జిల్లా నేతలకు కొన్ని సూచనలు చేశారు. బీసీ, మైనారిటీ, గిరిజనులకు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. విపక్షం సభకు రాకుండా, బాధ్యత లేకుండా తిరుగుతున్నప్పటికీ మనం మాత్రం బాధ్యతగా వ్యవహరించాలని, ప్రతిపక్షపాత్ర పోషించాలన్నారు. అవసరమైతే సమాధానం వచ్చే వరకూ మంత్రులను నిలదీయాలని, అందులో ఏమీ మొహమాటపడవద్దని చెప్పారు. ఎన్డీఏలో ఇంకా భాగస్వామిగా ఉన్న తమకే అపాయింట్‌మెంట్ ఇవ్వని ప్రధాని, కేంద్రమంత్రులు ఏ1-ఏ 2లకు నేరుగా అపాయింట్‌మెంట్ ఇస్తున్న విషయం దేశం మొత్తం గమనిస్తోందని, వారిద్దరి లాలూచీ రాజకీయాలను ప్రజలకు చెప్పాలని ఆదేశించారు. ఇక నేతలు రాష్ట్రంలో ప్రతి ఇంటి తలుపు తట్టి, కేంద్రం సహకరించకపోయినా వారి కోసం చేస్తున్న సంక్షేమాన్ని చెప్పాలన్నారు. అదే విధంగా కేంద్రం రాష్ట్రానికి చేసిన అన్యాయం ప్రతి ఇంటికీ తెలియాల్సిన అవసరం, బాధ్యత నేతలపై ఉందన్నారు. ‘ప్రజలు మనతోనే ఉన్నారు. మన కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్నారు. ఇన్ని కష్టాలున్నా లక్షల సంఖ్యలో సంక్షేమ పథకాలు తీసుకుని ఆనందంగా జీవిస్తున్నారు. కాబట్టి మనపై ఎవరెన్ని ప్రచారం చేసినా వారు నమ్మరు. అలాగని మీరు ఇంట్లో కూర్చుంటే, వారిని చెడగొట్టేవాళ్లు రెడీ అవుతారు. అందుకే ఇక మీరంతా జనంలోనే ఉండండ’ని ఆదేశించారు. దళిత తేజం కార్యక్రమానికి మంచి స్పందన లభించిందని, ఇదే స్ఫూర్తిని మైనారిటీ, బీసీ, గిరిజన తేజం కార్యక్రమాల్లోనూ చూపించాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు మాట్లాడుతూ కేంద్రంపై మీరు చేసిన ప్రసంగం దేశం అంతా చూసి మెచ్చుకుందని బాబును అభినందించారు.
ఏప్రిల్ 20 నుంచి మైనారిటీ, గిరిజన తేజం: వర్ల
కాగా ఏప్రిల్ 20 నుంచి మైనారిటీ, గిరిజన వర్గాలకు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రచారం చేయనున్నట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య మీడియాకు వెల్లడించారు. సమన్వయకమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అదేవిధంగా అక్టోబర్ 2 నుంచి మహానాడు జరిగే మే వరకూ బీసీ తేజం కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఆర్ధిక నేరగాళ్లకు ప్రధాని అపాయింట్‌మెంట్లు ఇస్తున్న వైనాన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలని, దీన్నిబట్టి వైసీపీతో బీజేపీ తెరచాటు బంధం కొనసాగిస్తోందన్న నిజం బయటపడిందని, దీనిని మైనారిటీ, గిరిజన, దళిత వర్గాలు గ్రహించాలని కోరారు.

చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు