రాష్ట్రీయం

కాంగ్రెస్సే.. పెద్ద విలన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణకు జరిగిన అన్యాయంలో కాంగ్రెస్ పార్టీ నెంబర్ వన్ విలన్‌గా పనిచేసిందని సీఎం కే. చంద్రశేఖరరావు ఆరోపించారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు బుధవారం సమాధానమిస్తూ, తెలంగాణ చరిత్రను వివరించారు. 58ఏళ్లపాటు కాంగ్రెస్ పార్టీ కబంధ హస్తాల్లో తెలంగాణ నలిగిపోయిందని, అభివృద్ధికి నోచుకోలేదన్నారు. తెలంగాణ కోసం తాను ఉద్యమాన్ని 1999లోనే ప్రారంభించానని తేల్చి చెప్పారు. కొండాలక్ష్మణ్ బాపూజీ ఇంట్లో 1999 ఏప్రిల్ 27న తొలి సమావేశం నిర్వహించానని, అప్పుడే తెలంగాణకు నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్ పార్టీ, ఆపార్టీ నేతలేనంటూ ప్రకటించానని గుర్తు చేశారు.
1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు సమయం నుండి నేటి వరకు కాంగ్రెస్ నేతల మనస్తత్వంలో ఎలాంటి మార్పులేదన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లో కలిపివేసింది ఆనాటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ అని, అందుకే నెహ్రూ కూడా తెలంగాణ విషయంలో నెంబర్ వన్ విలన్ అన్నారు. 1969లో 400మంది తెలంగాణ ఉద్యమకారులను కాల్చివేసిన ఘనత కాంగ్రెస్ నేతలు దక్కించుకున్నారన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం పేరుతో కాంగ్రెస్ నేతలు వ్యక్తిగతంగా లాభపడ్డారని, అలాంటి వారిలో తక్కళ్లపల్లి పురుషోత్తమరావు, జానారెడ్డి (తెలంగాణ ఫోరం పెట్టి), చిన్నారెడ్డి (తెలంగాణ కాంగ్రెస్ కో-ఆర్డినేషన్), జీవన్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, దానం నాగేందర్, సుధీర్‌రెడ్డి, తూర్పు జయప్రకాశ్‌రెడ్డి, బల్‌రాంనాయక్ తదితరులంతా తెలంగాణకు ద్రోహం చేసినవారేనని పేర్కొన్నారు.
కాంగ్రెస్ నేతలు మొదటి నుంచి పరాధీన స్థితిలో ఉంటూ వస్తున్నారన్నారు. ముల్కి రూల్స్ విషయంలో సుప్రీకోర్టు తీర్పును సైతం ఆనాటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ వమ్ము చేసిందని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారని కేసీఆర్ ఆరోపించారు. కృష్ణానదిపై నందికొండ వద్ద ప్రాజెక్టు కట్టి తెలంగాణకు నీరివ్వాలని నిజాంప్రభువు భావించారన్నారు. తెలంగాణకు 132 టీఎంసీ, ఏపీకి 132 టీఎంసీ నీరు ఉపయోగించాలని
తొలుత ప్రతిపాదించారని కేసీఆర్ గుర్తుచేశారు. నందికొండ ప్రాజెక్టు కట్టి ఉంటే నల్లగొండ జిల్లా మొత్తానికి సాగునీరు అందేదని తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు సాగునీరు లభించేదన్నారు. కాంగ్రెస్ నేతలు ఈ ప్రతిపాదనను అడ్డుకుని, ప్రాజెక్టును నందికొండ వద్ద కట్టకుండా నాగార్జునసాగర్ పేరుతో ప్రస్తుతం ఉన్న స్థలంలో కట్టారని, దాంతో 157 టీఎంసీలు ఎపికి 107 టీఎంసీలు తెలంగాణకు వచ్చేలా కేఎల్‌రావు డిజైన్ చేశారన్నారు. అలాగే పోచంపాడు ప్రాజెక్టు పేరుతో 330 టీఎంసిల నీటిని తెలంగాణకు ఇచ్చేందుకు నిజాంప్రభువు ప్రతిపాదిస్తే, కాంగ్రెస్ నేతలు 190 టీఎంసిల వినియోగానికి వీలుగా శ్రీరాంసాగర్ పేరుతో ఇప్పుడున్న ప్రాజెక్టుకు రూపకల్పన చేశారన్నారు. తెలంగాణలో చెరువులు, కుంటల నిర్మాణానికి కాకతీయ రాజుల తర్వాత నిజాంప్రభువులు పెద్దఎత్తున ప్రాధాన్యత ఇచ్చారని, వారి వల్లనే వేలాది చెరువులు, కుంటలు నిర్మాణమయ్యాయన్నారు. నిజాంసాగర్, కోయిల్‌సాగర్, ఘన్‌పూర్, ఆసిఫ్‌నగర్ తదితర చిన్నతరహా ప్రాజెక్టులను నిర్మించారన్నారు. సమైక్య రాష్ట్రంలో సింగూరు నీటిని సాగుకోసం ఇవ్వలేదని, తమపార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సింగూరు జలాలను మెదక్ జిల్లాల్లో సాగుకోసం ఇస్తున్నామని, హైదరాబాద్‌కు గోదావరి జలాలను తీసుకువచ్చామన్నారు. శ్రీశైలం జలాలను రాయలసీమకు రఘువీరారెడ్డి తీసుకువెళుతుండగా, కాంగ్రెస్ నాయకురాలు డీకే అరుణ మంగళహారతితో స్వాగత పలికారన్నారు. సమైక్యరాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో కిరణ్‌కుమార్‌రెడ్డి నిండు శాసనసభలో మాట్లాడుతూ, తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని ప్రకటిస్తే, తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలు నోళ్లు, చేతులు ముడుచుకుని కూర్చున్నారని, రాజీనామాలు చేయడమో, నిరసన వ్యక్తం చేయడమో చేయలేకపోయారని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో 75 వేల చెరువులు, కుంటలు నాశనమయ్యాయని ఆరోపించారు. ఇలాంటి కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని పేర్కొన్నారు. 2014 లో తెలంగాణలో కాంగ్రెస్ గెలిచి ఉంటే రాష్ట్రం మరింత నాశనమయ్యేదన్నారు.