రాష్ట్రీయం

ఏసీబీ వలలో అవినీతి జలగలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, మార్చి 14: అనంతపురంలో ఇద్దరు మైనర్ ఇరిగేషన్ ఇంజినీర్లు బుధవారం ఏసీబీ వలకు చిక్కారు. నీరు-చెట్టు కింద చేసిన పనులకు క్లియరెన్స్ సర్ట్ఫికెట్ ఇవ్వడానికి సంబంధిత కాంట్రాక్టర్ నుంచి డీఈ వీరారెడ్డి, ఏఈ డాక్యానాయక్ రూ.46 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు బుధవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దవడుగూరు మండలం పరిధిలో చిన్నవడుగూరు వద్ద కాలువలకు ఫీల్డ్ ఛానల్ పనుల్ని రూ.18 లక్షలకు కాంట్రాక్టర్ రవిశంకర్‌రెడ్డి దక్కించుకున్నాడు. 2017 ఏప్రిల్‌లో పనులు మొదలు పెట్టారు. వీటిని ఆదినారాయణ అనే వ్యక్తి రవిశంకర్‌రెడ్డి తరఫున చేశాడు. అనంతపురం ఇరిగేషన్ డివిజన్ పరిధిలోని తాడిపత్రి సబ్ డివిజన్‌లో చేపట్టిన ఈ పనులకు క్లియరెన్స్ సర్ట్ఫికెట్స్ ఇవ్వడానికి ఇంజినీర్లు లంచం డిమాండ్ చేయడంతో రవిశంకర్‌రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
దీంతో ఏసీడీ డీఎస్పీ జయరామరాజు నేతృత్వంలో ఇన్‌స్పెక్టర్లు చక్రవర్తి, ప్రతాప్‌రెడ్డి, ఖాదర్ దాడులు నిర్వహించారు. డీఈ వీరారెడ్డి రూ.20 వేలు, ఏఈ డాక్యానాయక్ రూ.20వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. అనంతరం వారి ఇళ్లలో సోదాలు నిర్వహించారు. డీఈ వీరారెడ్డి ఇంట్లో రూ.59 వేల నగదు, నగరంలోని నారాయణపురం, పాపంపేటలో ఉన్న రూ.1.29 లక్షల విలువైన మూడు ప్లాట్లకు సంబంధించి డాక్యుమెంట్లు లభించాయి. నిందితుల్ని గురువారం కర్నూలు ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తున్నట్లు డీఎస్పీ జయరామరాజు తెలిపారు.

చిత్రం..ఏసీబీకి పట్టుబడిన ఇరిగేషన్ అధికారులు వీరారెడ్డి, డాక్యానాయక్