రాష్ట్రీయం

రైల్వేస్టేషన్లలో ఆధునిక సౌకర్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 14: దేశంలో అనేక రైల్వే స్టేషన్ల అభివృద్ధికి రైల్వే నిర్ణయించింది. రైల్వే వ్యవస్థను ప్రయాణికులకు మరింత చేరువ చేసేందుకు వీలుగా రైల్వే మంత్రిత్వ శాఖ స్టేషన్ల అభివృద్ధిపై దృష్టి సారిస్తోంది. వౌలిక వసతులు మరింతగా మెరుగుపరుస్తూ అత్యాధునిక సౌకర్యాలతో స్టేషన్లను తీర్చిదిద్దాలని సంకల్పించింది. ఇందులో భాగంగా భారతీయ రైల్వే పరిధిలో తొలి దశలో 600 స్టేషన్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే 20 రైల్వే స్టేషన్లు ఇందులో భాగంగా అభివృద్ధి చెందనున్నాయి. తిరుపతి, గుంతకల్లు, అనంతపురం, కడప, రేణిగుంట, గుంటూరు, ఒంగోలు, చీరాల, ఏలూరు, తెనాలి, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, భీమవరం, తుని, కాకినాడ, కర్నూలు తదితర రైల్వేస్టేషన్లు తొలి దశలో అభివృద్ధికి నోచుకోనున్నాయి. తెలంగాణాలో నాంపల్లి, కాజీపేట, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, కాచిగూడ, మంచిర్యాల స్టేషన్లకు మోక్షం కలగనుంది. వీటిలో వౌలిక వసతులు మెరుగుపర్చడం, అత్యాధునిక సౌకర్యాలు కల్పించడం వంటి చేపట్టనుంది. దేశంలో ఉన్న పలు రాష్ట్రాల్లో ముఖ్యమైన రైల్వేస్టేషన్లలో అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధికి రైల్వేశాఖ పీపీపీ పద్ధతిని అనుసరించాలని ఆలోచన చేస్తోంది. అభివృద్ధి చేసిన కార్పొరేట్ సంస్థల కాలవ్యవధిని 40 ఏళ్ళ నుంచి 99ళ్ళకు పెంచేందుకు రైల్వేబోర్డు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. దీనిలోభాగంగానే పీపీపీ పద్ధతిలో 600 రైల్వే స్టేషన్ల అభివృద్ధిని చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. ఈ జాబితాలో ఏ-1 కేటగిరీ స్టేషన్లను, ఆ తరువాత ఎంపిక చేసిన స్టేషన్లు, వాటి పరిసరాల్లో ఉండే ఖాళీ స్థలాలను సైతం అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించుకోవాలని ఆలోచన చేస్తోంది. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు రైల్వే స్టేషన్లకు సమీపంలో రైల్వేకు చెందిన ఖాళీ స్థలాను ఇప్పటికే గుర్తించగా కేటగిరీ-2 స్టేషన్ల పరిధిలోనూ కొంతమేర ఖాళీ స్థలాలున్నట్టు తెలుస్తోంది. వీటిని పూర్తిస్థాయిలో ఉపయోగంలోకి తీసుకురావడానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని రైల్వేశాఖ ఆయా జోన్ల జనరల్ మేనేజర్లకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది.