రాష్ట్రీయం

31 తర్వాత.. తాడోపేడో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: మూడు సంవత్సరాలుగా వెనుకబడిన జాబితాలో స్థానం కోసం వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు సాగిస్తోన్న కాపు జేఏసీ మార్చి 31వ తేదీ తర్వాత తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతోంది. ఈ నెల 31వ తేదీలోగా ఆంధ్రప్రదేశ్‌లోని కాపులను బీసీలుగా ప్రభుత్వం ప్రకటించని పక్షంలో ఏప్రిల్ 1వ తేదీన ఉద్యమ కార్యాచరణ ప్రకటించే దిశగా జేఏసీ సాగుతోంది. ఈమేరకు కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తీసుకునే నిర్ణయంపై ఆయా వర్గాల్లో చర్చజరుగుతోంది. ఇటీవల కిర్లంపూడిలో ఏర్పాటుచేసిన జేఏసీ సమావేశంలో వివిధ జిల్లాల నేతలతో ముద్రగడ చర్చించారు. కాపులను బీసీలుగా గుర్తించినట్టు మార్చి 31వ తేదీలోగా ప్రకటించని పక్షంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ముద్రగడ చెప్పారు. కాపులకు బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) కేంద్ర హోంశాఖకు అభ్యంతరం చెప్పిన విషయం తెలిసిందే. కేంద్రం పరిధిలో ఉన్న రిజర్వేషన్ల అంశం కొలిక్కివచ్చి, బీసీ రిజర్వేషన్లు ప్రకటిస్తారని ఎదురుచూసిన కాపు జేఏసీ ఈ పరిణామం పట్ల తీవ్ర నిరసన వ్యక్తంచేసింది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర పరిధిలోనే కాపులకు రిజర్వేషన్లు వర్తింపజేయవచ్చని ముద్రగడ అన్నారు. గవర్నర్ ఆమోదంతో రిజర్వేషన్లు అమలుచేసే అవకాశం ఉందని న్యాయనిపుణులు స్పష్టం చేసినట్టు చెప్పారు. కాపుల రిజర్వేషన్లపై ప్రభుత్వం చేసిన తీర్మానంలో పసలేదని, మంజునాథ కమిషన్ స్పష్టత ఇవ్వకముందే హడావుడిగా కేంద్రానికి నివేదిక పంపారని, కావాలనే కాపులకు రిజర్వేషన్లు రాకుండా చేస్తున్నారని చంద్రబాబును ముద్రగడ విమర్శించారు. కాగా వ్యూహాత్మక ఎత్తుగడలతో సాగే ముద్రగడ మార్చి 31వ తేదీ తర్వాత తీసుకునే నిర్ణయంపై ఆయా వర్గాల్లో ఆసక్తి ఏర్పడింది. కాపు ఉద్యమానికి కేంద్రంగా మారిన తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ ప్రకటించనున్న భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో ఇసుక, మైనింగ్ మాఫియాలు రాజ్యమేలుతున్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు నూరు శాతం వాస్తవమని ముద్రగడ పద్మనాభం అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడిలో గురువారం ముద్రగడ మాట్లాడుతూ పవన్ చేసిన వ్యాఖ్యలు నిజమేనన్నారు.