రాష్ట్రీయం

లక్ష్యాలకు దర్పణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 15: తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ఆదాయ వనరులు, రాష్ట్రానికి ఉన్న అవసరాలు, ప్రభుత్వ ప్రాధాన్యతలు, లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్ కూర్పు జరిగిందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేసే విధంగా బడ్జెట్‌ను రూపొందించడం పట్ల ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, రాష్ట్ర ఆర్థిక సలహాదారు జిఆర్ రెడ్డిని ముఖ్యమంత్రి అభినందించారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని రంగాల అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమానికి ఉపయోగపడే విధంగా ఉందని సిఎం కొనియాడారు. రాష్ట్రంలో ఎక్కువ శాతం మంతి ఆధారపడిన వ్యవసాయరంగానికి అత్యధిక నిధులు ప్రతిపాదించడం సంతోషకరమన్నారు. సాగునీటి ప్రాజెక్టులు, పంటల పెట్టుబడికి మద్దతు పథకం, విద్యుత్ సబ్సిడీలకు ఎక్కువ నిధులు సమకూర్చడం వల్ల రాష్ట్రంలో వ్యవసాయరంగ అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తున్న కార్యక్రమాలు విజయవంతంగా ముందుకు సాగుతాయన్న ఆశాభావాన్ని సిఎం వ్యక్తం చేసారు.
*
గ్రామీణుల సంక్షేమం
హామీగా పద్దులెక్క అందాలొలికెన్
ధీమా తెరాసదేమరి
ఏమైనా ఎన్నికలిక ఏడాదేగా