రాష్ట్రీయం

విద్యుత్ సబ్సిడీకి ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: విద్యుత్ రంగానికి ఢోకాలేదు. నిధుల లేమి లేదు. 24 గంటల ఉచిత వ్యవసాయ విద్యుత్‌కు నిధుల లోటు లేకుండా చూడడంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. 2017-18 బడ్జెట్‌తో పోల్చితే, అదనంగా 340 కోట్ల నిధులను విద్యుత్ సబ్సిడీ కింద అదనంగా కేటాయించారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా రాష్ట్రప్రభుత్వం గుర్తించింది. అందుకే వచ్చే ఏడాదికి కూడా విద్యుత్ టారిఫ్ పెంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. తాజా బడ్జెట్ 2018-19లో విద్యుత్‌కు ఎకాఎకిన రూ. 5650 కోట్ల నిధులను కేటాయించారు. 2017-18లో తొలుత 4500 కోట్లు కేటాయించారు. కాగా సవరించిన బడ్జెట్ అంచనాల ప్రకారం ఈ కేటాయింపులు రూ.5292.66 కోట్లకు పెరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో రెండు డిస్కాం లు ఉన్నాయి. సదరన్ డిస్కాం, నార్తరన్ డిస్కాంల వల్ల రెవెన్యూ లోటు రూ.9800 కోట్లని అంచనా. ఈ మేరకు ఇప్పటికే విద్యుత్ డిస్కాంలు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలికి ప్రతిపాదనలు ఇచ్చిన విషయం విదితమే. మొత్తం అందుబాటులో ఉన్న విద్యుత్‌లో మూడో వంతు విద్యుత్ వ్యవసాయానికి ఖర్చవుతోందని విద్యుత్ శాఖాధికారులు తెలిపారు. 2016-17లో విద్యుత్ రంగానికి రూ.15,266.6 కోట్లను ఖర్చుపెట్టారు. ఇక సౌర విద్యుత్‌కు వస్తే రాష్ట్రం అవతరించే నాటికి కేవలం 31 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి అయ్యేది. ప్రస్తుతం 3283 మెగావాట్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పదివేల మెగావాట్లు దాటింది. రబీ సీజన్ వల్ల ఈ డిమాండ్ ఏప్రిల్ నెలాఖరు నాటికి 11వేల మెగావాట్లకు చేరుకునే అవకాశం ఉంది. కాని వివిధ విద్యు త్ ఒప్పందాలు అమలులో ఉండడం, ముం దస్తు చర్యలు తీసుకోవడం వల్ల విద్యుత్ కొరత తలెత్తదని అధికారులు చెప్పారు.