రాష్ట్రీయం

పోలవరం భేష్..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం: బహుళార్ధ సాధక పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి గతం కంటే భేషుగ్గా వుందని పోలవరం నిపుణుల కమిటీ, కేంద్ర జల సంఘం (సిబ్ల్యుసి) ఛైర్మన్ సయ్యద్ మసూద్ హుసేన్ పేర్కొన్నారు. సిడబ్ల్యుసి ఛైర్మన్ మసూద్ అధ్యక్షతన ఆయన నేతృత్వంలో పోలవరం నిపుణుల కమిటీ రెండు రోజుల పాటు పోలవరం ప్రాజెక్టు క్షేత్ర స్థాయిలో పర్యటించి అనంతరం అధికారులతో శనివారం రాజమహేంద్రవరంలో సమగ్ర సమీక్షా సమావేశాన్ని నిర్వహించి పనుల పురోగతిపై సమీక్షించారు. గతంతో పోల్చుకుంటే పోలవరం ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాయని, అన్ని విభాగాలపైనా సమగ్రంగా సమీక్షించామని నిపుణుల కమిటీ ఛైర్మన్ మసూద్ హుసేన్ సమీక్ష అనంతరం మీడియా సమావేశంలో చెప్పారు. పోలవరం హెడ్ వర్క్సు రాక్‌ఫిల్ ఎర్త్ కం డ్యామ్, స్పిల్ వే, స్పిల్ ఛానల్, డయాఫ్రం వాల్, గేట్లు తయారీ, అమర్చడం, మట్టి పని, భూసేకరణ, పునరావాస, పునర్నిర్మాణం,
ఒడిస్సా సరిహద్దు ముంపు సమస్య, ముంపు గ్రామాల పునరావాసం తదితర అన్ని విషయాలపైనా సమీక్షించామని తెలిపారు. గత అక్టోబర్‌లో కమిటీ పర్యటించిందని, అప్పటికీ ఇప్పటికీ పనుల్లో ఆశాజనకమైన పురోగతి కన్పిస్తోందని సంతృప్తి వ్యక్తం చేశారు. డిజైన్లపై కూడా సమీక్షించామని చెప్పారు. ఆయా పనుల లక్ష్యాల మేరకు జోరుగా జరుగుతున్నాయన్నారు. పనుల పురోగతి ఊపందుకుందన్నారు. పోలవరం నిపుణుల కమిటీలో ఛైర్మన్ మసూద్ హుసేన్ నేతృత్వంలో సభ్యులు ఆర్‌కె పచోరి, అనిల్ జైన్, జిఎల్ బన్సల్, చిత్రా రాజారత్నం, ఎస్‌కె హల్దర్, ఆర్‌కె గుప్త, ఎకె ప్రధాన్, డి రంగారెడ్డి పర్యటించారు. పోలవరం నిపుణుల కమిటీ సమీక్షా సమావేశంలో జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఇఎన్‌సి ఎం వెంకటేశ్వరరావు, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, డిప్యూటీ కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఐటిడిఎ పీవోలు, హెడ్ వర్క్సు ఎస్‌ఇ వి రమేష్‌బాబు, వివిధ హోదాల జల వనరుల శాఖ ఇంజినీర్లు పాల్గొన్నారు. పవర్‌పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా పనుల ప్రగతిని ఇఎన్‌సి వెంకటేశ్వరరావు వివరించారు. పద్దెనిమిదేళ్లు నిండినవారికి పునరావాస ప్యాకేజీ అందించాలని, ఛత్తీశ్‌గడ్, ఒడిస్సా, ఆంధ్రా మధ్య సరిహద్దు ముంపు సమస్యలను పరిష్కరించుకునేందుకు తీసుకున్న నిర్ణయాలు, పునరావాస ప్యాకేజీ పూర్తిచేసేందుకు చేపట్టిన చర్యలపై నిపుణుల కమిటీ పలు సూచనలు చేసింది. బచావత్ నిర్ణయాల మేరకు చర్యలు తీసుకోవాలని సూచించినట్టు తెలిసింది. ఈ సూచనలను పరిగణనలోకి తీసుకుని అమలు చేస్తామని అధికారులు తెలియజేశారు.
చిత్రం..పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై రెండురోజులు పర్యటించిన నిపుణుల కమిటీ శనివారం మంత్రి సమక్షంలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న దృశ్యం