రాష్ట్రీయం

కూటమి దిశగా వడివడి అడుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 17: టిఆర్‌ఎస్ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఫ్రంట్ ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. తృతీయ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన తర్వాత తొలి అడుగుగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బంగా ముఖ్యమంత్రి మమత బెనర్జీతో మంతనాలు జరిపేందుకు ఈనెల 19న కోల్‌కతా వెళ్ళనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రకటించగానే మమతా బెనర్జీ స్వాగతించారు. అంతేకాకుండా ఆమె కేసీఆర్‌కు ఫోన్ చేసి ఈ నిర్ణయాన్ని అభినందించారు. ఈ నేపథ్యంలో వారిరువురి చర్చలు కీలకం కాబోతున్నాయి. మమత చేసే సూచనలను పరిగణలోకి తీసుకుంటూ ఫ్రంట్ ఏర్పాటు ప్రక్రియను మరింత వేగవంతం
చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. తర్వాత మిగతా రాష్ట్రాలకూ వెళ్ళేందుకు, ఢిల్లీలో ముఖ్య నేతలతో మంతనాలు జరిపేందుకూ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది కాలం కూడా లేదు కాబట్టి కాంగ్రెస్, బిజెపియేతర పార్టీలను కలుపుకుని ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో ఆయన ఉన్నారు. 1982 సంవత్సరం మార్చి 27న నాడు సినీమా రంగం నుంచి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశించి, టిడిపిని స్థాపించిన 9 నెలలకే అధికారాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. మేకప్‌లు వేసుకునే సినీ నటుడు రాజకీయాల్లోకి రావడమా? అనే హేళన చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం టిఆర్‌ఎస్‌ను స్థాపించి ఉద్యమించినప్పుడూ చాలా మందికి అనుమానాలు ఉండేవని కేసీఆరే స్వయంగా చెప్పారు. కాబట్టి ఫ్రంట్ ఏర్పాటు విషయంలోనూ చాలా మందికీ అనుమానాలు ఉన్నప్పటికీ అవన్నీ ఫటాపంచలై పోతాయని కేసీఆర్ ధీమాగా ఉన్నారు. కాంగ్రెస్, బిజెపి పక్షాల పాలనను ప్రజలు చూసి, విసిగి పోయారని, వారు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారని, ఇదే సరైన సమయమని ఆయన విశ్వసిస్తున్నారు. నాడు ఎన్టీఆర్ టిడిపిని స్థాపించి విజృంభించి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చినట్లు సంవత్సరంలోపే ఉన్న ఎన్నికలను భావసారూప్యగల పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి కేంద్రంలో అద్భుతం సృష్టించాలన్న లక్ష్యం, పట్టుదలతో కేసీఆర్ ఉన్నారు.
భారతీయ ఫ్రంట్ రాబోతున్నది..
రెండు రోజుల క్రితం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానమిస్తూ కాంగ్రెస్, బిజెపిలను తూర్పారబట్టారు. ఇదే సందర్భంలో ఆయన భారతీయ ఫ్రంట్ ఏర్పాటుకు పక్కా ప్రణాళిక ఉందన్నారు. ఏ లక్ష్యం, ఉద్దేశ్యంతో ఫ్రంట్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారో కూడా సూచన ప్రాయంగా చెప్పారు. దేశ ప్రజలకు దిశా నిర్ధేశం చేయనున్నట్లు ఆయన తెలిపారు.
తృతీయ కాదు ఫస్టే..
ఇలాఉండగా తృతీయ ఫ్రంట్ అనడాన్ని కేసీఆర్ తనయుడు రాష్ట్ర ఐటి, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కే. తారక రామారావు అభ్యంతరం వ్యక్తం చేశారు. తృతీయ అనకూడదని, ఫస్ట్ ఫ్రంటేనని అన్నారు. కేసీఆర్ కుమార్తె, ఎంపి కవిత ఫెడరల్ ఫ్రంట్‌గా అభివర్ణించారు. పేరు ఏదైనా దేశ వ్యాప్తంగా కేసీఆర్ నేతృత్వంలో ఏర్పాటుకానున్న ఫ్రంట్ చర్చనీయాంశమైంది.