రాష్ట్రీయం

ఐటి@హైదరాబాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దేశానికి తలమానికంగా ఉన్న హైదరాబాద్ ఐటి రంగం ఎగుమతులు ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.1 లక్ష కోట్లు దాటే అవకాశం ఉంది. గత నాలుగేళ్లలో రాష్ట్రప్రభుత్వం ఐటి రంగం అభివృద్ధికి రూపొందించిన ఐటి పాలసీ ఫ్రేమ్ వర్క్‌తో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఐటి రంగంలో హైదరాబాద్ స్థానం దేశంలోని ఇతర నగరాలతో పోల్చితే సుస్థిరంగా ఉండడమేకాకుండా ఎటువంటి మాంద్యానికి లోనుకాకుండా పైపైకి ఎగబాకుతోంది. రాష్ట్రప్రభుత్వం రూపొందించిన ఐసిటి పాలసీ ఫ్రేమ్‌వర్క్‌లో డాటా సెంటర్లు, ఇ-వేస్ట్, ఐఒటి గ్రోత్, సైబర్ సెక్యూరిటీ, డాటా అనలిటిక్స్, ఓపెన్ డాటా, ఇన్నోవేషన్, రూరల్
టెక్నాలజీ సెంటర్లు, ఇమేజి పాలసీ, డాటా సెంటర్ల విధానాలను పొందుపరిచారు. సామాజిక ఆర్థిక అవుట్‌లుక్ విధానం ప్రకారం 2014-2015లో 1200 ఐటి కంపెనీలు, 2015-16లో 1400 కంపెనీలు, 2016-17లో 1500 కంపెనీలు పనిచేస్తున్నాయి. రాష్ట్రప్రభుత్వం సాలీనా ఐటి రంగంలో వౌలిక సదుపాయాల అభివృద్ధికి వచ్చే ఏడాది బడ్జెట్‌లో రూ.289కోట్లను కేటాయించింది. గత మూడేళ్లలో ఐటి రంగంలవో ఉద్యోగుల సంఖ్య 3,71,774 నుంచి 4,31,891కు చేరుకుంది. ఉద్యోగాలు, ఎగుమతుల శాతాన్ని విశే్లషిస్తే మూడేళ్లలో వృద్ధిరేటు 29 శాతం దాటింది. అలాగే ఎగుమతుల విలువ రూ. 66276 కోట్ల నుంచి రూ. 85,470 కోట్లకు 2016-17కు చేరుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో 13 రోజుల్లో ముగుస్తుంది. దాదాపు ఒక లక్ష కోట్ల రూపాయల వరకు ఎగుమతుల విలువ నమోదయ్యే అవకాశం కనపడుతోంది. 1500కుపైగా ఉన్న ఐటి కంపెనీలపై ఆధారపడి ఏడు లక్షల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఐటి రంగంలో ఎగుమతుల విలువ జాతీయ స్థాయిలో పది శాతం ఉంటే, హైదరాబాద్ 13 శాతం నమోదు చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో ఐటి రంగం జిల్లాలకు విస్తరిస్తోంది. వరంగల్‌లో ఫేస్-1లో ఐటి ఇంక్యుబేషన్ సెంటర్ పనిచేస్తోంది. రెండు ఎకరాల్లో 15 చదరపు అడుగుల్లో నిర్మించారు. వెయ్యి మందికి ఉపాధి కల్పిస్తోంది. రెండవ దశలో ఐటి ఇంక్యుబేషన్ సెంటర్ నిర్మాణం చేపట్టారు. ఈ ఏడాదిలో ఈ నిర్మాణం పూర్తవుతుంది. వరంగల్‌లో 45 ఎకరాల్లో ఐటి సెజ్‌ను నిర్మిస్తున్నారు. జనగాం, కరీంనగర్, ఖమ్మంలో ఐటి కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. ఖమ్మం జిల్లా కేంద్రంలో 50 వేల చదరపు అడుగుల్లో ఇంక్యుబేషన్ సెంటర్‌ను రూ.25 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్నారు. రెండు వందల మంది ఐటి నిపుణులకు ఉపాధి లభిస్తుంది. రూరల్ టెక్నాలజీ యూనిట్స్‌ను టూ టైర్ నగరాల్లో ఏర్పాటు చేస్తున్నారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో కాకతీయ శాండ్ బాక్స్ ఫర్ సోషల్ ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సైబర్ సెక్యూరిటీ పాలసీతో ఐటి రంగానికి టెక్నాలజీపరంగా సవాళ్లు ఎదురుకాకుండా చర్యలు తీసుకుంటున్నారు. లీగల్ రెగ్యులేటరీ, ఎన్‌ఫోర్స్‌మెంట్, సైబర్ సెక్యూర్ కల్చర్, బిజినెస్ డెవలప్‌మెంట్ విధానాన్ని ఖరారు చేశారు.
ఇ వేస్ట్ పాలసీని తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. దేశంలో ఇ-వేస్ట్ సాలీనా 25 శాతం పెరుగుతోంది. హైదరాబాద్‌లో సాలీనా 25 ఎంటి ఇవేస్ట్ ఉత్పత్తిఅవుతోంది. ఇ-వేస్ట్ యాజమాన్య విధానాలను అమలు చేసేందుకు పటిష్టమైన విధానాన్ని అమలు చేస్తున్నట్లు సామాజిక, ఆర్థిక సర్వే అవుట్‌లుక్‌లో పేర్కొన్నారు.