రాష్ట్రీయం

హక్కులు కాపాడాల్సింది న్యాయమూర్తులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత న్యాయమూర్తులపైనే ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వర రావు అన్నారు. విశాఖ ఏయూ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో ‘రూల్ ఆఫ్ లా’ అంశంపై ఆయన ప్రసంగించారు. భారత రాజ్యాంగం ఎంతో పవిత్రమైనదని, ప్రపంచంలో ఏ దేశానికీ లేని అంశాలు భారత రాజ్యాంగంలో పొందుపరిచారన్నారు. భారతదేశంలో అనేక ప్రాంతాలు ఇప్పటికీ వెనుకబాటు తనంలో మగ్గుతున్నాయని, అవిద్య, నిరుద్యోగం వంటి రుగ్మతలు దేశాన్ని పట్టిపీడిస్తున్నాయన్నారు. న్యాయ వ్యవస్థలో కొన్ని మార్పులు అవశ్యమని, అప్పుడే సమన్యాయం సాధ్యమవుతుందన్నారు. న్యాయ వ్యవస్థ ఆయా ప్రాంతాల వాడుక భాషల్లో పనిచేస్తే మంచి ఫలితాలు రావడమే కాకుండా, అందరికీ అన్ని అంశాలపై అవగాహన కలుగుతుందన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే మాట్లాడుతూ మనం అనుసరించే ధర్మమే దేశానికి బలాన్నిస్తుందన్నారు. ధర్మం నాగుపాదాలపై నడిచే నేలపై జయం లభిస్తుందన్నారు. ధర్మం అనేది ఆస్తి రూపంలో ఉండదని, ఇది మనసుకు సంబంధించిన అంశంగా పేర్కొన్నారు.

చిత్రం.. విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి లావు నాగేశ్వర రావు