రాష్ట్రీయం

ముస్తాబవుతున్న ఒంటిమిట్ట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంటిమిట్ట, మార్చి 17: ఏకశిలపై వెలసిన శ్రీ కోదండరాముడి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు కడప జిల్లా ఒంటిమిట్ట ముస్తాబవుతోంది. త్రేతాయుగంలో జాంబవంతునిచే ఏకశిలపై ప్రతిష్ఠించబడిన శ్రీ సీతారామలక్ష్మణులు భక్తకోటి నీరాజనాలందుకుంటున్నారు. పౌర్ణమి రోజు స్వామివారి కల్యాణం నిర్వహించడం ఒంటిమిట్ట ప్రత్యేకత. ప్రపంచవ్యాప్తంగా శ్రీరామనవమి రోజు స్వామివారి కల్యాణం నిర్వహిస్తుంటారు. అయితే ఒంటిమిట్టలో మాత్రం నవమి తరువాత వచ్చే పౌర్ణమి రోజు రాత్రి పండువెనె్నలలో కోదండరామస్వామి, సీతమ్మతల్లి కల్యాణం కన్నులపండుగా జరుగుతుంది. 11 రోజుల పాటు ఒంటిమిట్టలో జరిగే శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు వేలాది మంది తరలిరానున్నారు. ఇందుకోసం టీటీడీ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ నెల 24న అంకుర్పారణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 3వ తేదీ పుష్పయాగం, ఏకాంతసేవతో ముగుస్తాయి. 24న ఆలయశుద్ధి, సుప్రభాతం, వ్యాసాభిషేకం, అంకుర్పారణ, ఏకాంతసేవ, 25న శ్రీరామనవమి సందర్భంగా ధ్వజారోహణం, పోతన జయంతి, కవి సమ్మేళనం, రాత్రి శేష వాహన సేవ, ఏకాంత సేవ ఉంటాయి. 26వ తేదీ ఉదయం వేణుగానాలంకరణ, సాయంత్రం ఊంజల్‌సేవ, రాత్రి హంస వాహన సేవ, ఏకాంత సేవ, 27న ఉదయం వటపత్ర సాయి అలంకారం, స్నపన తిరుమంజనం, సాయంత్రం ఊంజల్ సేవ, రాత్రి సింహ వాహన సేవ, ఏకాంత సేవ, 28న నవనీత కృష్ణాలంకారం, సాయంత్రం ఊంజల్ సేవ, రాత్రి హనుమంత వాహన సేవ, 29న ఉదయం మోహినీ అలంకారం, స్నపన తిరుమంజనం, సాయంత్రం ఊంజల్ సేవ, రాత్రి గరుడసేవ, 30న ఉదయం శివ ధనుర్భాలంకారం, ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం, రాత్రి ఎదుర్కోలు ఉత్సవం ఉంటాయి. అదే రోజు రాత్రి 8 గంటల నుంచి 10 గంటలకు సీతారాముల కల్యాణోత్సవం కన్నుల పండువగా నిర్వహిస్తారు. రాత్రి 10 గంటలకు గజ వాహన సేవ ఉంటాయి. 31న ఉదయం సీతారామలక్ష్ముణుల రథోత్సవం నిర్వహిస్తారు. ఏప్రిల్ 1వ తేదీ ఉదయం కాళీయ మర్ధన అలంకారం, స్నపన తిరుమంజనం, సాయంత్రం ఊంజల్ సేవ, రాత్రి అశ్వ వాహన సేవ, ఏప్రిల్ 2న చక్ర స్నానం, సాయంత్రం ధ్వజావరోహణం, 3వ తేదీ సాయంత్రం పుష్పయాగం, రాత్రి ఏకాంతసేవతో ఉత్సవాలు ముగుస్తాయి.
ఉత్సవాలు జరిగే 11 రోజులు రాత్రి 6 గంటల నుండి 9 వరకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నమయ్య హరికథా కాలక్షేపం, ధార్మిక ఉపన్యాసాలు ఉంటాయి. 25వ తేదీ శ్రీరామనవమి రోజు పోతన జయంతి సందర్భంగా కవి సమ్మేళనం నిర్వహిస్తారు.
వేడుకలు జరిగే 11 రోజులు టీటీడీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టనున్నారు. ఉత్సవాలకు ఒంటిమిట్టను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. గ్రామోత్సవం నిర్వహించే మాడావీధులు, పురవీధులను శుభ్రం చేశారు. ఆలయం పరిసరాల్లో వివిధ దేవతామూర్తుల అలంకారాల లైటింగ్ ఏర్పాటు చేశారు.