రాష్ట్రీయం

నూతనోత్తేజాన్ని నింపే ఉగాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 17: ప్రకృతితో ముడిపడి ఉన్న ఉగాది అందరి జీవితాల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతుందని ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు అన్నారు. శనివారం రాత్రి రాజ్‌భవన్‌లో జరిగిన ఉగాది వేడుకల్లో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. పండుగల వెనుక శాస్ర్తియ సందేశం ఉంటుందని, అందులో ఉగాదికి ఎంతో ప్రాముఖ్యత ఉందని అన్నారు. తెలుగువారికి నూతన సంవత్సరం ఉగాదేనన్న విషయం కూడా చాలామందికి తెలియదని అన్నారు. పండుగలంటే సెలవుల కోసమేనన్న భావన పిల్లల్లో ఉందని దానిని తొలగించాలని కోరారు. ప్రకృతితో మమేకమై జీవించాలని ఉగాది మనకు భోదిస్తుందని, ఉగాది పచ్చడిలో తీపి, చేదు, వగరు కష్టసుఖాల మేళవింపే జీవితమని చెబుతాయని అన్నారు.
జీవితం అంటే ఆర్థిక పరిపుష్టి, ఉద్యోగ ఉన్నతి, రాజకీయ పదోన్నతే కాదని సర్వకళలను తెలుసుకొని ఆస్వాదించడమే జీవిత పరమార్థమని వివరించారు. విశ్వమానవాళి మేలుకోరుకునే సంస్కృతి భారతీయులదని అన్నారు. మన సంస్కృతి, సాంప్రదాయాలు, మాతృబాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. విళంబి నామ సంవత్సరం తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ ప్రజలందరికీ సుఖసంతోషాలను పంచునుందని గరవ్నర్ నర్సింహన్ అన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా గరవ్నర్ నర్సింహన్ వచ్చిన తరువాత రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలు నిర్వహిస్తూ కొత సంప్రదాయానికి నాంది పలికారని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అన్నారు. రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో ఉగాది సకల సంతోషాలను ఇస్తుందని అన్నారు. కొండగడప శ్రీవిద్య శ్రీ్ధరశర్మ పంచాంగ శ్రవణం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.

చిత్రాలు...శనివారం రాత్రి రాజ్‌భవన్‌లో జరిగిన ఉగాది వేడుకల్లో ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడును సత్కరిస్తున్న గవర్నర్ నరసింహన్. పక్కన తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు.
*ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు