రాష్ట్రీయం

నేటినుంచి భద్రాద్రిలో బ్రహ్మోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, మార్చి 17: కోదండ రాముడు కొలువుదీరిన భద్రగిరిలో ఆదివారం నుంచి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో వసంతపక్ష ప్రయుక్త తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 1 వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 26న శ్రీరామ కల్యాణం, 27న పట్ట్భాషేకం నిర్వహించనున్నారు. ఇందుకోసం భద్రాచలాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. విళంబినామ సంవత్సర చైద్రశుద్ధ పాడ్యమి ఉగాదిని పురస్కరించుకొని ఉదయం ఆరు గంటలకు వేప పూత ప్రసాద వినియోగం, మూలవరులకు అభిషేకం జరపనున్నారు. రాత్రి పంచాంగ శ్రవణం నిర్వహించి శ్రీ సీతారామచంద్రస్వామికి తిరువీధి సేవ జరుపుతారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో నేటినుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఆలయంలో నిత్యకల్యాణాలను నిలిపివేయనున్నారు. ఉత్సవాలకు ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహన్‌ను ఆహ్వానించేందుకు ఇప్పటికే దేవస్థానం ఈవో వైదిక కమిటీతో కలిసి హైదరాబాద్ వెళ్లారు. సీఎం, గవర్నర్‌లను ఆహ్వానిస్తూ నేడు ఆలయం తరుపున రాజపత్రాలను అందజేయనున్నారు.