రాష్ట్రీయం

తెలుగు తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఈ విద్యా సంవత్సరం (2018-19) నుంచి రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్‌గా బోధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇంటర్ వరకు తెలుగును తప్పనసరి సబ్జెక్ట్‌గా చేయాలని ప్రభుత్వం మొదట భావించినప్పటికీ అమలులో ఇబ్బందులు ఉన్నాయని గుర్తించింది. దీంతో మొదటి దశలో దీనిని పదవ తరగతి వరకు మాత్రమే అమలు చేయాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ప్రకటించారు.
ఈ మేరకు ప్రస్తుతం కొనసాగుతున్న శాసనసభ బడ్జెట్ సమావేశాల్లోనే చట్టం చేయనున్నట్టు వెల్లడించారు. మాతృభాష బోధనను అమలు చేస్తున్న తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాలలో పరిశీలించిన తర్వాత మొదటి దశలో పదవ తరగతి వరకే పరిమితం కావాలని నిర్ణయించినట్టు వివరించారు. మాతృభాష బోధన అమలు జరుగుతున్న తమిళనాడులో అధ్యయనం చేయడానికి వెళ్లివచ్చిన అధికారుల బృందం ప్రగతి భవన్‌లో మంగళవారం ముఖ్యమంత్రితో సమావేశమైంది. ఈ సందర్భంగా తెలుగును ఒక సబ్జెక్ట్‌గా బోధించడానికి రూపొందించిన
విధి విధానాలపై చర్చించిన అనంతరం ఈ విద్యాసంవత్సరం నుంచే తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్‌గా బోధించాలని సీఎం ఆదేశించారు. మొదట ఇంటర్మీడియట్ వరకు తెలుగును తప్పనిసరి చేయాలని భావించిచామని, అయితే అన్ని విద్యాసంస్థల్లో ఇంటర్మీడియట్ ఒకే మాదిరిగా లేదని గుర్తించినట్టు చెప్పారు. దీంతో ఇంటర్మీడియట్ వరకు తెలుగును తప్పనిసరి చేయడంలో కొంత ఇబ్బందికరంగా ఉండటంతో మొదటి దశలో పదవ తరగతి వరకే పరిమితం చేస్తున్నట్టు సిఎం వివరించారు. ‘మాతృభాష తెలుగును రక్షించుకోవడం, మన సంస్కృతిని కాపాడుకోవడం లక్ష్యంగా రాష్ట్రంలో అన్ని విద్యాసంస్థల్లో తెలుగును సబ్జెక్ట్‌గా బోధించాలని నిర్ణయించాం. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇంగ్లీషు మీడియంలో చదవడం అందరికీ అనివార్యమైంది. పిల్లల భవిష్యత్‌ను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అదే క్రమంలో తెలుగు భాష కనుమరుగు కాకుండా చూసుకోవాలి. అందుకే ఇంగ్లీష్ మీడియంలో చదివే విద్యార్థులు కూడా తెలుగును తప్పరిసరిగా నేర్చుకోవాలనే నిబంధన పెడుతున్నాం’ అని సిఎం అభిప్రాయపడ్డారు. తరగతుల వారీగా తెలుగులో బోధించాల్సిన అంశాలకు సంబంధించి సిలబస్‌ను రూపొందించాల్సిందిగా తెలుగు విశ్వవిద్యాలయం, సాహిత్య అకాడమీలను సిఎం ఆదేశించారు. భాషను కాపాడుకోవడంతో పాటు మాతృభాష వల్ల ఉన్న ఉపయోగాలను విద్యార్థులకు వివరించాలని సూచించారు. విద్యార్థుల్లో నైతిక విలువలు, దేశభక్తిని పెంచే అంశాలు ఉండాలన్నారు. తెలుగు చదివే పిల్లలకు ఉజ్వల భవిష్యత్ ఉండడానికి అవసరమైన చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో కూడా తప్పనిసరిగా ఒక తెలుగు పండిట్ ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖాధికారులను సిఎం ఆదేశించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు తారకరామారావు, జూపల్లి కృష్ణారావు, పద్మారావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ఎస్‌వి సత్యనారాయణ, సాహిత్య అకాగమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి, ఎస్‌ఇఆర్‌టి అధికారి సువర్ణ వినాయక్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..మాతృభాష బోధన అమలుకు సంబంధించి అధ్యయనం చేసిన అధికారుల బృందంతో
మంగళవారం సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్