ఆంధ్రప్రదేశ్‌

ఇది ప్రజాదేవాలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: సమస్యల పరిష్కార వేదికైన సచివాలయాన్ని త్వరితగతిన నిర్మించి సుపరిపాలన అందిస్తూ ప్రజా దేవాలయంగా తీర్చిదిద్దుతానని సిఎం చంద్రబాబు హామీఇచ్చారు. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో బుధవారం వెలగపూడి రెవెన్యూ గ్రామ పరిధిలో 45.12 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించ తలపెట్టిన తాత్కాలిక సచివాలయానికి సిఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు సచివాలయానికి అనుసంధానం చేసి సుపరిపాలన అందిస్తామన్నారు. 2016 జూన్ 15నుంచి నూతన రాజధాని అమరావతిలో పరిపాలన ప్రారంభిస్తానన్నారు. కొందరు వ్యక్తులు, ప్రతిపక్షాలు అవగాహన లేక, ఉద్దేశపూర్వకంగా చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూ, ప్రస్తుతం తాత్కాలిక సచివాలయం కోసం నిర్మించే భవనం శాశ్వతమైనదని సమాధానమిచ్చారు. రాష్ట్రంలోని 5 కోట్ల ప్రజలకు చేరువలో పరిపాలన జరగాలనే సంకల్పంతో సచివాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. హైదరాబాద్ నుంచి ఇక్కడకు వచ్చే ఉద్యోగులకు సాధారణ స్థాయిలో అద్దెలు ఉండే విధంగా ఈ ప్రాంత ఇళ్ల యజమానులు పెద్ద మనసు చేసుకుని సహకరించాలన్నారు. హైదరాబాద్ నుంచి 15 వేల మంది ఉద్యోగులు ఇక్కడకు వస్తారన్నారు. అందువల్ల అద్దెలు అమాంతంగా పెంచకుండా అవకాశమిస్తే, వారి కోసం భవిష్యత్‌లో గృహాలు నిర్మిస్తామన్నారు. వారంతా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తే పాలన సజావుగా సాగించి శాశ్వత సచివాలయ నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. సచివాలయం, శాసనసభ, శాసనమండలి, హైకోర్టులు నిర్మించి భవిష్యత్‌కు దిక్సూచిగా నిలవాలన్నారు. రాష్ట్రాన్ని అనైతికంగా విభజించటం వలన అన్ని విధాలా నష్టపోయామన్నారు. ఫైనాన్స్ కమిషన్ నివేదిక ప్రకారం 2019 వరకు లోటు బడ్జెట్ ఉంటుందన్నారు. దేశంలో జమ్మూ, కాశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలు మాత్రమే లోటుబడ్జెట్‌ను ఎదుర్కొంటున్నాయన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా రాజధాని అమరావతిని కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య ఎంపిక చేయటం జరిగిందన్నారు. లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల రైతులు తనపై విశ్వాసం ఉంచి 33 వేల ఎకరాలు ఇచ్చేందుకు ముందుకొచ్చారన్నారు. రైతుల ఆశయాలకు అనుగుణంగా పరిపాలన అందించి భూముల ధరలు పెరిగేలా చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. అందువల్లనే త్వరితగతిన నిర్మాణాలు చేపట్టాలనే ఉద్దేశంతో సచివాలయానికి శంకుస్థాపన చేసినట్టు చెప్పారు. 2015 జూన్ 6న భూమి పూజ, అక్టోబర్ 22 విజయదశమి రోజున దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించామన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం జరుగుతుందన్నారు. కేవలం 5 నెలల 20 రోజుల్లో పట్టిసీమ నుంచి గోదావరి జలాలను కృష్ణకు తరలించామన్నారు. రాయలసీమను కరవురహిత సీమగా చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రపంచంలోనే యువత ఎక్కువగా ఉన్న దేశం భారత దేశమన్నారు. జపాన్, చైనా, యూరఫ్ దేశాలు వయస్సు మీరిన వారి సంఖ్య పెరగటం వలన సమస్యలకు గురవుతుండగా, మన దేశంలో సుమారు 65 శాతం 30 ఏళ్లకు లోపుయువత ఉండటం వలన ప్రపంచాన్ని శాసించే స్థితిలో ఉన్నామన్నారు. ఇటీవల విశాఖలో నావికదళ పర్యవేక్షణలో జరిగిన ఫ్లీట్ రివ్యూకు 50 దేశాల నావికాదళ అధిపతులు హాజరై ప్రధాని మోదీకి సెల్యూట్ చేయటంతో మన శక్తి నిరూపితమైందన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు పెట్టుబడులు ఆహ్వానించగా రూ 4.70 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. రాష్ట్రానికి సుదీర్ఘ తీరప్రాంతం ఉన్నందున 15 నుంచి 20 వేల కోట్ల పెట్టుబడితో ఓడరేవుల అభివృద్ధి జరుగుతుందన్నారు. నదుల అనుసంధానం కూడా పూర్తిచేస్తే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందన్నారు. కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో విద్వేషాలను రెచ్చగొట్టవద్దన్నారు. రాష్ట్రంలో అరాచకం పెరిగితే అభివృద్ధి జరగకపోగా శాంతిభద్రతలకు విఘాతం వాటిల్లే ప్రమాదముందన్నారు. తన 35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇటువంటి రాజకీయ నేతలను చూడలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ముందు విమర్శలు మానండి.. సహకరించండి.. లేదంటే గమ్మున ఉండండి.. దండం పెడతానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. తుళ్లూరు ప్రాంతం నుంచి చాలా కుటుంబాలు దేశ, విదేశాలకు వెళ్లారని, అటువంటి ప్రాంతంలో రాజధాని నిర్మించి ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఇక్కడకు వచ్చి చూసే విధంగా తీర్చిదిద్దుతానన్నారు. వీరోచిత పొరాటాలకు నాయకత్వం వహించింది ఉద్యోగులేనన్నారు. రాష్ట్భ్రావృద్ధికి కలిసి పని చేద్దాం.. రమ్మని కోరగా వెంటనే సానుకూలంగా స్పందించారన్నారు. భవనాల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేస్తే వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఉద్యోగులు హామీ ఇచ్చారని సిఎం చంద్రబాబు తెలిపారు.

చిత్రం... తాత్కాలిక సచివాలయానికి
శంకుస్థాపనలో పునాది రాయి వేస్తున్న సిఎం చంద్రబాబు