రాష్ట్రీయం

సమీపిస్తున్న కల్యాణ ఘడియలు ముస్తాబవుతున్న భద్రాద్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, మార్చి 23: సీతారాముల కల్యాణానికి భద్రాద్రి క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. స్వాగత ద్వారాలు, భక్త రామదాసు కీర్తనలతో భద్రాద్రి పూర్తిగా భక్తాద్రిగా మారిపోయింది. రామాలయానికి విద్యుద్దీపాలంకరణలు, వెదురు పందిళ్లు, చాందినీ వస్త్రాలంకరణలు భక్తులకు కనువిందు చేయనున్నాయి. ఇక కల్యాణ వేడుకలను ఈ నెల 26వ తేదీ సోమవారం అభిజిత్ లగ్నంలో మిథిలా స్టేడియంలోని శిల్పకళా శోభితమైన కల్యాణ మండపంలో ప్రారంభించనున్నారు. శుక్రవారం స్థానిక జీయర్ మఠంలో ధ్వజపట భద్రక మండల లేఖనం ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. కల్యాణ వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు హాజరై స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ నెల 27న మహా పట్ట్భాషేకం రోజున గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరుకానున్నారు. ఇక సీతారామ కల్యాణాన్ని తిలకించేందుకు పలువురు భక్తులు పాదయాత్రగా భద్రాద్రి చేరుకుంటుండగా మరికొందరు భక్తులు వాహనాల్లో రామయ్య సన్నిధికి వస్తున్నారు. దేవస్థానం ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో నవమి, పట్ట్భాషేకం టిక్కెట్లు అందుబాటులో ఉంచారు. జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, ఎస్పీ అంబర్ కిశోర్‌ఝా ఇప్పటికే ఏర్పాట్లు పరిశీలించారు. ప్రముఖుల పర్యటన నేపథ్యంలో 2000 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. విళంబినామ సంవత్సరంలో ఈసారి కల్యాణం రావడం, ఈ మహాభాగ్యం మళ్లీ 60 ఏళ్ల తర్వాత రానుండడంతో భక్తులు ఈసారి అధికంగా వస్తారని భావిస్తున్నారు. శ్రీరామ నవమి ఉత్సవాలను తిలకించేందుకు భద్రాచలం వచ్చే భక్తుల కోసం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఈసారి సుమారు 700 బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీ కృష్ణ చైతన్య సంఘం నిర్వాహకుడు కల్యాణం అప్పారావు సారథ్యంలో భక్తబృందం శుక్రవారం గోటితో ఒలిచిన దశ కోటి తలంబ్రాలను దేవస్థానానికి సమర్పించారు. వీటిని తయారుచేయడానికి మూడు నెలల సమయం పట్టగా, పలు గ్రామాలకు చెందిన 2 వేల మంది మహిళలు పాల్గొన్నారు.