రాష్ట్రీయం

మండుతున్న ఎండలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం/ విజయవాడ: తీరప్రాంతం వినా రాష్టవ్య్రాప్తంగా మైదాన ప్రాంతాల్లో మెల్ల మెల్లగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వేసవి ప్రభావంతోపాటు తీరాన్ని ఆనుకుని ఏర్పడుతున్న అల్పపీడన ద్రోణి ప్రభావం కారణంగానే పగటి ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కన్పిస్తోందని విశాఖ వాతావరణ పరిశోధన కేంద్రం శనివారం తెలిపింది. తీరం వెంబడి ద్రోణి కొనసాగుతున్న సందర్భాల్లో మైదాన ప్రాంతాల్లో సహజంగానే పగటి ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం నెలకొంటుంది. ప్రస్తుతం పశ్చిమబంగ, ఒడిశా రాష్ట్రాల నుంచి ఉత్తరాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొసాగుతోంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు కాస్త పెరిగాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. తీరం వెంబడి తేమతో కూడిన వాతావరణం నెలకొనడం ద్వారా కాస్త ఉపశమనం ఉంటుంది. ఇదిలా ఉండగా రెండు రోజులుగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కన్పిస్తోంది. రాయలసీమ జిల్లాలు కర్నూలులో 41 డిగ్రీలు, అనంతపురం 40 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తిరుపతి 38 డిగ్రీలు, నెల్లూరు, గన్నవరం 37 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు కాగా వాల్తేరు 33, కళింగపట్నం 31 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇదిలావుంటే, రాష్ట్రంలో 5 జిల్లాల్లో ఆదివారం ఒక మోస్తరుస్థాయిలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ శనివారం హెచ్చరికలు
జారీ చేసింది. విశాఖ, గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు దాదాపు 40 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు ఎండలో బయటకు తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి సూచించింది. విశాఖ జిల్లా గూడెం కొత్తవీధి, కొయ్యూరు, గొలుగొండ, నాతవరం, నర్సీపట్నం, గంటూరు జిల్లా నిజాంపట్నం, ప్రకాశం జిల్లా పెద్దారవీడు, కారంచేడు, చీరాల, వేటపాలెం, కొండపి, చినగంజాం, కడప జిల్లా చింతకొమ్మదినె్న, కడప, కర్నూలు జిల్లాలో ఆత్మకూరు, శ్రీశైలం, పాములపాడు, ఉయ్యాలవాడ, కోయిలకుంట్లలో సాధారణం కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.