రాష్ట్రీయం

కరెంట్ చార్జీలు పెంచం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 24: విద్యుత్ చార్జీలు పెంచే యోచన లేదని, తెలంగాణ మిగులు విద్యుత్ రాష్ట్రం కాదని, 2024 నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా అవతరించేందుకు విద్యుత్ ప్రణాళికను ఖరారు చేసినట్లు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి ఇంతవరకు 48వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలుకు రూ.20500కోట్లను ఖర్చుచేశామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో క్షణం కూడా విద్యుత్ కోతలు లేకుండా పరిశ్రమలు, వ్యవసాయం, గృహ విద్యుత్ రంగానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. శనివారం ఆయన అసెంబ్లీలో బిజెపి ఎమ్మెల్యేలు డాక్టర్ కె లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సోలిపేట రామచంద్రారెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ, ఓపెన్ టెండర్ల ద్వారానే విద్యుత్ కొనుగోలు చేస్తున్నామన్నారు. ఎన్టీపిసి ద్వారా విద్యుత్ కొనుగోలుకు ఎక్కువ ధరచెల్లిస్తున్నామన్నారు. ఎన్టీపిసి వెల్లూరు నుంచి కొనుగోలు చేస్తే యూనిట్‌కు రూ.5.42, ఎన్టీపిసి కొడ్గి నుంచి కొనుగోలు చేసిన దానికి రూ. 5.46 చెల్లిస్తున్నామన్నారు. టెడర్ల ద్వారా వెళ్లినా టిఎస్‌ఇఆర్‌సి ధరలను ఖరారు చేయాల్సి ఉంటుందన్నారు. రైతులకు నిరంతర విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. విద్యుత్ కొనుగోలుకు ప్రభుత్వ రంగ సంస్థ కూడంకళం ఎన్టీపిసిని గతంలో సంప్రదించామన్నారు. యూనిట్ విద్యుత్ పది రూపాయలు, మూడు నెలల అడ్వాన్సు చెల్లించాలన్నారు. ప్రైవేట్ విద్యుత్ సంస్థలు తక్కువ రేటుకే విద్యుత్ విక్రయించేందకు ముందుకు వచ్చాయన్నారు. కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాలకు లోబడి విద్యుత్ కొనుగోలు చేస్తున్నామన్నారు. గతంలో విద్యుత్ బిల్లులు చెల్లించని ప్రభుత్వ కార్యాలయాలను జప్తు చేసిన సందర్భాలు ఉన్నాయన్నారు. ఈ రోజు విద్యుత్ సంస్థలకు ప్రభుత్వ కార్యాలయాలు సకాలంలో బిల్లులు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉదయ్ పథకంకింద రాష్ట్రప్రభుత్వం డిస్కాంల ఆర్థిక భారం రూ.8 వేల కోట్లను భరిస్తోందన్నారు. దీనికి సంబంధించి కేంద్రం రూ.1300 కోట్ల నిధులు మంజూరు చేస్తామని
హామీ ఇచ్చిందని, ఇందులో 60 శాతం గ్రాంటుగా వస్తాయన్నారు. ఈ స్కీంలో చేరడం వల్ల ఇంకా లాభాలు రాలేదన్నారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 10300మెగావాట్లకు చేరుకుందని, ఎంత విద్యుత్ డిమాండ్ వచ్చినా తట్టుకునే శక్తి తమకు ఉందన్నారు. తెలంగాణలో వ్యవసాయానికి విద్యుత్ 24 గంటలు సరఫరాచేయడంపై దేశంలోని అన్ని రాష్ట్రాలు ఆసక్తిని కనపరుస్తున్నాయన్నారు. రాష్ట్రంలో సౌర విద్యుత్ 3284 మెగావాట్లు ఉత్పత్తి చేస్తున్నామన్నారు. సోలార్ డెవలపర్స్ నుంచి యూనిట్ విద్యుత్ రూ.4.66కు, సేంబ్‌కార్ప్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ నుంచి రూ.4.15కు విద్యుత్ కొనుగోలు చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తొలుత విద్యుత్ పంపిణీ నష్టాలు 12 శాతానికి పైబడి ఉండేవన్నారు. ఇప్పుడు 10.03 శాతానికి తగ్గాయన్నారు.