రాష్ట్రీయం

డిజిటల్ ఆర్టీసీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్‌ఆర్టీసీ) ఆధునాతన డిజిటల్ టెక్నాలజీని వినియోగించుకుని మరిన్ని సేవలను ప్రయాణీకులకు అందుబాటులోకి తెచ్చేందుకు అడుగులేస్తోంది. ఈమేరకు కొన్ని ప్రతిపాదనలను ఈ ఏడాది సిద్ధంచేసి అమల్లోకి తేవాలని భావిస్తోంది. ప్రయాణీకులు ఆర్టీసీ బస్సుల్లో టిక్కెట్లు కొనుగోలుకు నగదు చెల్లిస్తున్నారు. ప్రస్తుతం 95 శాతం సర్వీసుల్లో టిక్కెట్లను జారీ చేసే టికెట్ ఇష్యూ మిషన్ (టిమ్)లను ఆర్టీసీ వినియోగిస్తోంది. ఈ టిమ్స్ స్ధానంలో డిజిటల్ టెక్నాలజీతో కూడిన ఇంటెలిజెంట్ టిమ్స్‌ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఆధునాతన టిమ్స్ ద్వారా నగదు చెల్లింపుతోపాటు యూరో పే, మాస్టర్ కార్డ్, వీసా కార్డ్, క్రెడిట్ కార్డుల ద్వారా టిక్కెట్‌కు సరిపడా మొత్తం చెల్లించి ప్రయాణీకులు టిక్కెట్లు కొనుగోలు చేసే వీలుంటుంది. ఈ ప్రక్రియ ద్వారా నగదు రహిత లావాదేవీలను కిందిస్థాయి నుంచి అమలు చేసేందుకు అవకాశం కలుగుతుందని భావిస్తోంది. ప్రస్తుతం అడ్వాన్స్‌డ్ రిజర్వేషన్ టిక్కెట్లను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేందుకు నెట్‌బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్ కార్డులను వినియోగిస్తున్నారు. కొన్ని రిజర్వేషన్ల కౌంటర్ల వద్ద కూడా కార్డులను వినియోగించడం ద్వారా నగదు రహిత లావాదేవీలను ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది. ఏసీ బస్సులు, దూర ప్రాంత బస్సులతో పాటు సిటీ సర్వీసుల్లోనూ డిజిటల్ చెల్లింపులు ప్రోత్సహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. అలాగే ప్రయాణీకులు టిక్కెట్లు పొందాలంటే మొబైల్ యాప్ ద్వారా తీసుకునేందుకు కూడా సరికొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. వజ్ర మినీ ఏసీ బస్సులతో పాటు మిగిలిన ఏసీ సర్వీసులు, దూర ప్రాంత సర్వీసుల్లో టిక్కెట్లను తీసుకునే ప్రక్రియను ఈ యాప్ ద్వారా సులభతరం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. పర్యావరణ పరిరక్షణకు పెద్ద పీట వేస్తూ గో గ్రీన్ మిషన్ అమలు
చేస్తూ ఫేమ్ ఇండియా పథకం కింద హైదరాబాద్ నగరంలో 60 ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశ పెట్టేందుకు ఆర్టీసీ ప్రతిపాదించింది. తర్వాత దశల వారీగా విస్తరించేందుకు నిర్ణయించింది. రవాణా శాఖ మంత్రి పి.మహేందర్ రెడ్డి వీటిని అమలు చేసేందుకు ఆర్టీసీ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ప్రయాణీకులకు తాము ప్రయాణించాలకున్న వాహనం ఎక్కడ ఉందీ తెలుసుకునేందుకుగాను వెహికిల్ ట్రాకింగ్ విధానాన్ని అమల్లోకి తేవాలని కూడా ఆర్టీసీ యోచిస్తోంది. తద్వారా సమాచార వ్యవస్థ నేరుగా ప్రయాణీకుడి వద్దకే చేరుకుని, ఎప్పుడు వాహనం వస్తుందనేది ప్రయాణీకుడికే తెలుస్తుంది. ఇందుకు అనుగుణంగా కూడా యాప్‌ను డిజైన్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకా ఆర్టీసి ఆదాయాన్ని మెరుగుపర్చుకునేందుకు 8 ప్రాంతాల్లో బిఓటి ప్రాతిపదికన సులభతర వ్యాపారం కోసం ప్రణాళిక సిద్దం చేస్తోంది. రాష్ట్రంలో 23 ప్రధాన బస్ స్టేషన్లలో మినీ థియేటర్లను ఏర్పాటు చేసేందుకు ఆర్టీసి ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. టెండర్లను కూడా పిలిచి ఎంపిక చేసే ప్రక్రియను చేపట్టింది. ఈరకంగా 335 బస్ స్టేషన్లలో ఏర్పాటు చేయాలని ఆర్టీసి ప్రతిపాదించింది.