రాష్ట్రీయం

వచ్చే ఏడాది నుంచే తెలుగు తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 24: పాఠశాల స్థాయిలో విద్యార్థులు తెలుగు భాషను తప్పని సరిగా చదవాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన బిల్లు శనివారం శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి హఠాత్తుగా బిల్లును శాసనభలో ప్రవేశపెట్టారు. శనివారం ఉదయం అసెంబ్లీకి సమర్పించిన అజండాలో బిల్లు ప్రస్తావన లేదు. అసెంబ్లీ సమావేశాలు మరో రెండురోజుల పాటే జరుగుతుండటంతో హడావుడిగా ప్రవేశపెట్టాల్సి వచ్చిందని కడియం వివరించారు. సభ్యులు ఏమైనా సూచనలు, సలహాలిస్తే నియమావళిలో పొందుపరుస్తామని హామీ ఇచ్చారు. 2018-19 విద్యాసంవత్సరం నుండే తెలుగు భాషను తప్పనిసరిగా చదవాలన్న నిబంధనను అమలు చేస్తామన్నారు. ప్రాథమిక స్థాయిలో 1 నుండి 5 వరకు ఒకదశగా, ఉన్నతస్థాయిలో 6 నుండి 10 వరకు రెండోదశగా తెలుగు భాషాబోధన అమలు చేస్తామన్నారు. ఒకటో తరగతి విద్యార్థులు తెలుగు తప్పనిసరిగా చదివేందుకు పాఠ్యపుస్తకాన్ని 2018-19లో ప్రారంభిస్తామన్నారు. తర్వాత ఒక్కో సంవత్సరం తదుపరి తరగతిలో అంటే రెండు, మూడు, నాలుగు, ఐదో తరగతికి ప్రవేశపెడుతూ ఐదేళ్లలో ఐదోతరగతి వరకు అమలు చేస్తామన్నారు. అలాగే ఉన్నతస్థాయికి సంబంధించి ఆరోతరగతిలో 2018-19 సంవత్సరంలో తెలుగుభాషాబోధన ప్రారంభమవుతుందని, ఆ తర్వాత 7, 8, 9, పదోతరగతి వరకు ఒక్కో సంవత్సరం ఒక్కో తరగతికి ఐదేళ్లలో అమల్లోకి తెస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని పాఠశాలలు, తెలంగాణలో నడుస్తున్న కేంద్రప్రభుత్వం పరిధిలోని పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు, తమిళం, కన్నడం, ఒరియా, ఉర్దూ తదితర మీడియంలలోని పాఠశాలల్లో కూడా తెలుగు తప్పనిసరిగా విద్యార్థులు నేర్చుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పుస్తకాల తయారీ బాధ్యతను తెలుగు సాహిత్య అకాడమి, తెలుగు విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహిస్తాయని కడియం తెలిపారు. సభ్యులు కిషన్‌రెడ్డి, జాఫర్‌హుస్సేన్, ఆర్. కృష్ణయ్య, సున్నంరాజయ్య తమ అభిప్రాయాలను తెలిపారు.