రాష్ట్రీయం

కొత్తగా నగర పంచాయతీలు 150

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం: రాష్ట్రంలోని పలు మేజర్ పంచాయతీలు రానున్న కాలంలో నగర పంచాయతీలుగా రూపాంతరం చెందనున్నాయి. ఇందుకు రాష్ట్ర కేబినెట్ సబ్-కమిటీ కూడా ఆమోదం తెలిపినట్టు తెలిసింది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదమే తరువాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 14 కార్పొరేషన్లు, 96 మున్సిపాల్టీలు, నగరపంచాయతీలు వెరసి 110 ఉన్నాయి. సీఎం గ్రీన్ సిగ్నల్ ఇస్తే మరో 150 నగరపంచాయతీలు ఏర్పడతాయి. ఇదే జరిగే రాష్ట్రంలో మొత్తం మున్సిపాల్టీల సంఖ్య 260కి చేరుకుంటుంది. దేశంలో అత్యధిక మున్సిపాల్టీలు కలిగిన తమిళనాడు సరసన ఆంధ్రప్రదేశ్ చేరనుంది. దీనివల్ల పట్టణాలు, నగరాల అభివృద్ధికి కేంద్రం కేటాయిస్తున్న నిధులు ఏపీకి కూడా వరదలా వచ్చిపడే అవకాశముంది.
ప్రస్తుతం దేశంలో అమలవుతోన్న అమృత్ (2045 నాటికి జనాభా నిష్పత్తి ఆధారంగా తాగునీటిని అందరికి అందించాలన్న ఉద్దేశంతో రూపొందించిన పథకం) వంటి పథకం ఆంధ్రప్రదేశ్‌లోని చాలా మున్సిపాల్టీలకు వరంగా మారింది. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఇక రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 48,363 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో మేజర్ పంచాయతీల వివరాలను ఏడాది క్రితమే రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. వాటిలో జనాభా నిష్పత్తి, ఆదాయం తదితర వివరాల ఆధారంగా 150 మేజర్ పంచాయితీలను గుర్తించారు. వాటిని ఇప్పుడు నగర పంచాయతీలుగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ప్రయత్నాలు చేస్తోంది. కాగా 2009లోనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ప్రతిపాదన నడిచింది. ఆ తర్వాత 2011లో మరోసారి తెరమీదకు వచ్చిన ఈ ప్రతిపాదన ద్వారా ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం 50 మేజర్ పంచాయితీలను నగర పంచాయతీలుగా మార్చేందుకు అప్పటి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం అన్ని సిద్ధంచేసింది. ఆ సమయంలో కొన్ని మేజర్ పంచాయతీలు మాత్రమే నగర పంచాయతీలుగా రూపాంతరం చెందాయి. ఇప్పుడు తాజాగా 2011 ప్రతిపాదనను తెరమీదకు తీసుకువచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం 25వేల జనాభా (గ్రామం, ఆనుకుని ఉన్న గ్రామాల జనాభ కలిపి) , ఆదాయ వనరులను పరిగణలోకి తీసుకుని నగర పంచాయతీలుగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 150 మేజర్ పంచాయితీలను నగర పంచాయితీలుగా మార్చడానికి పురపరిపాలనా శాఖ రంగం సిద్ధంచేసింది. పంచాయతీలు సమ్మతించినా సమ్మతించకపోయినా నగర పంచాయతీల మార్పు అనివార్యం. ఆగస్టు తర్వాత పంచాయతీలకు ప్రత్యేక పాలన అనివార్యం అనుకుంటున్న నేపథ్యంలో మేజర్ పంచాయతీలను నగర పంచాయతీలుగా మార్చడం అనివార్యం కానున్నట్లు తెలిసింది.