రాష్ట్రీయం

నేడు సీతారాముల పెళ్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మార్చి 25: లోక కల్యాణ కారకుడు జగదభిరామునికి కల్యాణ శోభ వచ్చింది. దీంతో భద్రాచలం రంగుల దీపాలు, తాటాకు పందిళ్లతో కళకళలాడుతోంది. భద్రాద్రిలో ఆదివారం రాత్రి ఎదుర్కోలుతో శ్రీ సీతారాముల కల్యాణోత్సవానికి సన్నాహాలు పూర్తయ్యాయి. సోమవారం అభిజిత్ లగ్నంలో సీతారాముల కల్యాణ మహోత్సవానికి మిథిలా నగరాన్ని సకల హంగులతో తీర్చిదిద్దారు. తలంబ్రాలు, లడ్డూలను సిద్ధం చేశారు. శ్రీరామనామ స్మరణతో భక్తులు పులకించిపోతున్నారు. భద్రాచలంతో పాటు పర్ణశాలలోనూ సీతారాముల కల్యాణోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. భద్రాద్రిలో జరిగే కల్యాణోత్సవంలో స్వామివారికి ప్రభుత్వ పెద్దగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు, లేదా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఇదిలావుంటే ఆదివారం రాత్రికే భారీగా తరలివచ్చిన భక్తులకు సరిపడా వసతి సౌకర్యాలు కల్పించారు. ఈసారి శ్రీరామనవమికి 1.50 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. భక్తుల కోసం దేవస్థానం 3.50 లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచింది. ఈసారి ఆర్టీసీ బస్సుల్లోనూ తలంబ్రాలను ఉచితంగా అందజేసేందుకు చర్యలు తీసుకున్నారు. తాగునీటి సమస్య రాకుండా
గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.
కల్యాణోత్సవం..
వసంతపక్ష ప్రయుక్తంగా నవాహ్నిక దీక్షతో జరిగే బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన మహోత్సవం సీతారాముల కల్యాణం. ఈ వివాహ వేడుక విళంబి నామ సంవత్సర చైత్రశుద్ధ శ్రీరామనవమి సోమవారం అభిజిత్ లగ్నంలో 10.30 గంటల నుంచి 12.30 గంటల వరకు జరుగుతుంది. కల్యాణ మహోత్సవం జరిపించేందుకు దైవజ్ఞులు ఈ శుభ ముహూర్తాన్ని నిర్ణయించారు. శ్రీరాముల వారి జన్మ నక్షత్రం నాడే ఈ పెళ్లి క్రతువు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కల్యాణం మరికొద్ది గంటల్లో జరగనున్న నేపథ్యంలో ఆదివారం రాత్రి ఆలయ సమీపంలో ఎదుర్కోలు ఉత్సవం ఘనంగా జరిగింది. వరుడు బంధువులతో వచ్చే సమయంలో పొలిమేర నుంచి కన్యాదాత స్వాగతం పలికే వేడుకే ఈ ఎదుర్కోలు. అమ్మవారి తరపున స్థలసాయి, రాముల వారి తరపున వేద పండితులు ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. సీతారాముల గొప్పతనాన్ని వివరించే ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
చిత్రం..కల్యాణోత్సవం సందర్భంగా విద్యుద్దీప కాంతుల్లో భద్రాద్రి రామాలయం