రాష్ట్రీయం

శ్రీరాముని బ్రహ్మోత్సవాల్లో క్షణక్షణం ఇలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, మార్చి 25: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగం గా శ్రీరామనవమి, పట్ట్భాషేకం వేడుకగా నిర్వహించనున్నారు. వీటికి సంబంధించి ఆలయంలో ప్రత్యేక పూజ లు జరగనున్నాయి. శ్రీరామనవమి నాడు ఉదయం 2గంటలకు ఆలయ తలుపులు తీసి 2.30 వరకు సుప్రభాత సేవ చేస్తారు. 2.30 గంటల నుంచి 4.30 వరకు తిరువారాధన, నివేద న కార్యక్రమం వల్ల దర్శనం ఉండదు. 4 గంటల నుంచి 5 గంటల వరకు మూలవరులకు అభిషే కం. 5 గంటల నుంచి 5.30 వరకు అలంకారం. 5.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వ రకు సర్వ, శీఘ్ర దర్శనాలు ఉంటాయి. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు మూలమూర్తులకు తిరుకల్యాణం. 9 నుంచి 9.30 వరకు ఉత్సవమూర్తులకు అలంకరణ. 9.30 నుంచి 10.30 వరకు ఉత్సవమూర్తులు ఊరేగింపుగా కల్యాణ మండపానికి చేరుకుంటారు. 10.30 నుంచి 12.30 గం టల వరకు సీతారాముల కల్యాణం జరుగుతుం ది. మధ్యాహ్నం 12.30 నుంచి స్వామివారిని ఆలయానికి తీసుకొచ్చి రాజభోగం చేస్తారు. 2 గంట ల నుంచి 6 వరకు భక్తులకు దర్శనం ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు ఆరాధన, 6.30 గంటల నుంచి రాత్రి 10.30 వరకు దర్శనం ఉంటుంది. రాత్రి 8 గంటల నుంచి 10 వరకు కల్యాణరాముడు తిరువీధి సేవకు వెళతారు. 10 గంటలకు నివేదన. 10.30 గంటలకు ఆలయ తలుపులు మూస్తారు. ఇక పట్ట్భాషేకం నాడు ఉదయం 4 గంటలకు ఆలయ తలుపులు తెరుస్తారు. సుప్రభాత సేవ, ఆరాధన అయిన తర్వాత 6 నుంచి 11.30 గంటల వరకు దర్శనం. ఉదయం 7 నుంచి 8 గంటల వరకు రామపాదుకలకు అభిషేకం. 9.30 నుంచి 10.30 వరకు ఉత్సవమూర్తులు ఊరేగింపుగా మండపానికి చేరుకుంటారు. 10.30 నుంచి 12.30 వరకు మహా పట్ట్భాషేకం. 12.30 నుంచి ఒంటి గంట వరకు స్వామివారు ఆలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ఆలయ తలుపులు మూస్తారు. మధ్యా హ్నం 3 నుంచి 6 గంటల వరకు దర్శనం. సా యంత్రం 6 నుంచి 6.30 వరకు దర్శనం నిలిపివేస్తారు. తిరిగి 6.30 నుంచి 9.30 వరకు దర్శనం. రాత్రి 7 నుంచి 9.30 వరకు రథోత్సవం జరుగుతుంది. 9.30 నుంచి 10 గంటల వరకు ఆరగింపు చేసి ఆలయ తలుపులు మూస్తారు.