రాష్ట్రీయం

తిరుమలలో శ్రీరామ నవమి ఆస్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మార్చి 25: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం శ్రీరామ నవమి ఆస్థానాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలి పి, తోమాలసేవ, అర్చనను ఏకాంతంగా నిర్వహించారు. ఆలయంలోని రంగనాయకుల మండపం లో ఉదయం 9 నుంచి 11 గంటల వర కు శ్రీ సీతారామలక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్ల కు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించా రు. ఈసందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, శ్రీసూ క్తం, భూసూక్తం, నీలాసూక్తం, పంచశాంతి మంత్రా లు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అ నుసంధానం చేసే పాశురాలను పండితులు పఠించారు. ఈ వేదపఠనంతో శ్రీవారి ఆలయం మరింత ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
హనుమంత వాహనంపై వేంకటాద్రి రాముడు
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య శేషాచలధీశుడు శ్రీరాముని అవతారంలో తన భక్తుడైన హనుమంతునిపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. శ్రీవేంకటేశ్వరుణ్ణి శ్రీరాముడిగా భావించి, శ్రీవారి సుప్రభాతాన్ని రచించిన శ్రీహస్తిగిరినాథన్ కౌసల్యా సుప్రజా రామా అం టూ స్తుతించారు. రామాయణంలోని శ్రీరాముడే ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు, ఈ యుగంలో శ్రీనివాసుడు. అందుకే శ్రీవారు వేంకటరాముడు, వేంకటకృష్ణుడు, వేంకటాచలపతి. ఇలా త్రివేణి సంగమంలా శ్రీవారి హనుమంత వాహన సేవ సాగింది. హనుమంతుని పైనున్న శ్రీవారిని దర్శించడంతో ఇహమేకాక పరమమైన మోక్షం కూడా లభిస్తుందని పండితులు తెలిపారు. అనంతరం రాత్రి 10 నుంచి 11గంటల నడుమ బంగారువాకిలి వద్ద శ్రీరామనమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘా ల్, ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

చిత్రం..స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తున్న అర్చకులు