రాష్ట్రీయం

అట్టహాసంగా శోభాయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగరంలో నిర్వహించిన శ్రీరామనవమి శోభాయాత్ర దిగ్విజయంగా ముగిసింది. ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా భక్తిశ్రద్దలతో శ్రీరాముడి శోభయాత్రను పూర్తి కావడంతో నగర పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. దాదాపు 20 వేల మంది పోలీసుల పహారాలో, నిఘా నీడలో ప్రశాంతంగా పూర్తవడంతో పోలీసులు గండం గడిచిందని అనుకున్నారు. ఆదివారం కావడం, శ్రీరాముడి శోభాయాత్రను కనులారా వీక్షించేందుకు వేలాదిగా తరలి వచ్చారు. కిలోమీటర్ దూరానికి ఒక ఆఫీసర్ పర్యవేక్షణ ఏర్పాటు చేసి, సాయుధ బలగాలను రక్షణగా ఏర్పా టు చేశారు. దాదాపు 300 సిసి కెమెరాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. సీతారాంబాగ్ రాణి అవంతిబాయ్ ఆలయం వద్ద నుంచి ప్రారంభమైన శోభాయాత్ర గౌలిగూడ రామమందిరం వరకు కొనసాగింది. దాదాపు 8 కి.మీ దూరం జరిగిన యాత్ర ను కంటికి రెప్పలా నిఘాతో పోలీసులు పర్యవేక్షించారు. నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ స్వయంగా భద్రత ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. కమాండ్ కంట్రోల్ రూం నుంచి నేరుగా పర్యవేక్షించి కింది స్ధాయి అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు చేశారు. దక్షిణ మండల డిసిపి సత్యనారాయణ ఈ భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. యాత్ర జరిగిన రూట్ మొత్తం సీనియర్ ఆఫీసర్లకు బాధ్యతలు అప్పగించారు. కాగా ఒక దశలో శోభాయాత్రకు సంబంధించి కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగినట్లు వదంతులు రావడంతో పోలీసులు తీవ్రంగా పరిగణించారు. నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ఇలాంటి వదంతులు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిశితంగా యాత్రను పరిశీలించామని తెలిపారు. భక్తులు సహకరించి ఆనందోత్సాహాల మధ్య శ్రీరాముడి శోభాయాత్రలో పాల్గొని ఆనందించారని అన్నారు. పోలీస్‌తో పాటు జిహెచ్‌ఎంసి, ఆర్‌అండ్‌బి, వాటర్‌వర్క్స్, ఎలక్ట్రిసిటీ, ఫైర్ సర్వీస్, ఇతర కీలక శాఖల అధికారులంతా సమన్వయంతో కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సమీక్షించారని తెలిపారు.

చిత్రం..హైదరాబాద్ నగరంలో నిర్వహిస్తున్న శ్రీరామనవమి శోభాయాత్ర