రాష్ట్రీయం

నేటి నుంచి ఎలక్ట్రికల్ సోలార్ వెహికల్ చాంపియన్‌షిప్ పోటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, మార్చి 26: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ ఆవరణలో మంగళవారం నుంచి ‘ఎలక్ట్రికల్ సోలార్ వెహికల్ చాంపియన్ షిప్-2018’ ప్రారంభం కానుంది. ఏప్రిల్ 2వ తేదీ వరకు జరిగే ఈ పోటీల్లో దేశంలోని 16 రాష్ట్రాల నుండి 64 జట్లు పాల్గొంటున్నాయి. ఇంపీరియల్ సొసైటీ ఆఫ్ ఇన్నోవేటివ్ ఇంజనీర్స్ (ఐఎస్‌ఐఇ) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈపోటీలు ఆసియా ఖండంలోనే అతి పెద్ద సోలార్ ఈవెంట్‌గా నిర్వాహకులు చెబుతున్నారు. 16 రాష్ట్రాల్లోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన 1500 మంది వివిధ బ్రాంచ్‌లకు చెందిన ఇంజనీర్లు 64 బృందాలుగా పోటీల్లో పాల్గొననున్నారు. సాంకేతిక పరిశీలన, వ్యాపార ఆధారిత పరీక్ష, డిజైన్ అండ్ ఇన్నోవేషన్ టెస్ట్, వాహన బరువు, వేగం పరీక్షతో పాటు హిల్ క్లైంబింగ్, సౌరసామర్ధ్యపు పరీక్ష, అదే విధంగా ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పిస్తారు. చివరిగా వివిధ బహుళజాతి సంస్థల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. బోస్క్ హైబ్రిడ్ వెహికల్ సిస్టమ్స్ పరిశీలకులు, నోయినా ఆటో ఇండస్ట్రీ, లోహియా, నెడ్ క్యాప్, తదితర వ్యాపార సంస్థల ప్రతినిధులు హాజరుకానున్నారని విష్ణు మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాసరాజు సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఛాంపియన్ షిప్ లొగోలను ఆవిష్కరించారు.