రాష్ట్రీయం

ఆరోగ్య శాఖపై 75 శాతం సంతృప్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 26: వైద్య, ఆరోగ్యశాఖ పనితీరు పట్ల ప్రజల్లో 75 శాతం సంతృప్తి వ్యక్తమైంది. రియల్ టైమ్ గవర్నెన్స్ సంస్థ 1100 పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి వైద్య, ఆరోగ్య శాఖపై సేకరించిన ప్రజాభిప్రాయంలో 75 శాతం ఆ శాఖ పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో సోమవారం సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ స్టేట్ కమాండ్ సెంటర్‌లో ఆరోగ్యశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ శాఖ పనితీరుపట్ల ప్రజల్లో సంతృప్తి స్థాయి మెరుగ్గా ఉండటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ శాఖ అధికారులను అభినందించారు. కేవలం ఈ శాతంతో సంతృప్తి చెందకుండా మరింతగా సేవలను ప్రజలకు చేరువ చేసి సంతృప్తి స్థాయిని మరింతగా పెంచుకోవాలని సూచించారు. అదే సందర్భంలో ఆసుపత్రుల్లో జరుగుతున్న కొన్ని సంఘటనలు, అక్కడ ఉత్పన్నమవుతున్న సమస్యలపై అధికారులు తక్షణం స్పందించాలన్నారు. ఇటీవల తిరుపతి, పుత్తూరు తదితర ప్రాంతాల్లోని కొన్ని ఆసుపత్రుల్లో చోటుచేసుకున్న కొన్ని సంఘటనలు, వాటికి సంబంధించి పత్రికల్లో వచ్చిన వార్తలను అధికారుల వద్ద ప్రస్తావించారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వెంటనే అధికారులు స్పందించి ఆ సంఘటనలకు కారణమేంటి, వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే వారిపై చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు మరింత మెరుగ్గా వైద్య సేవలు అందించడానికి ఎన్ని రకాల అవకాశాలున్నాయో వాటి గురించి ఆలోచించి వాటిని అమలు చేయడానికి ప్రయత్నించాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖలో అమలుచేస్తున్న వివిధ పథకాల అమలు పట్ల ప్రజల్లో వ్యక్తమైన సంతృప్తి స్థాయి గురించి రియల్ టైమ్ గవర్నెన్స్ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేశారు.