రాష్ట్రీయం

నేత్రానందం.. సీతారాముల కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం/నెల్లిమర్ల, మార్చి 26: ఉత్తరాంధ్రలో పవిత్ర పుణ్యక్షేత్రమైన రామతీర్థంలోని శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం అంగరంగ వై భవంగా జరిగింది. సోమవారం నెల్లిమర్ల మండలం రామతీర్థంలో శ్రీ సీతారాముల కల్యాణ ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తకోటి జనం తరలివచ్చారు. 60 ఏళ్లకు ఒకసారి వచ్చే విళంబి నామ సంవత్సరం శ్రీ రాముని జన్మ సంవత్సరం కావడంతో ఈ దఫా క ల్యాణ ఉత్సవాలు ప్రత్యేకతను సంతరించుకున్నా యి. ఆలయ అనువంశిక ధర్మకర్త, మాజీ కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు, సతీమణి సునీలా గజపతిరాజు దంపతులు పట్టువస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను స్వామికి సమర్పించారు. రాష్ట్ర ప్ర భుత్వం తరఫున మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు. వైసీపీ నేత బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ ఝాన్సీలక్ష్మి దంపతులు కూడా స్వామివారికి పట్టు వస్త్రాలను, తలంబ్రాలను సమర్పించారు. ఉదయం 10.20 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణ ఘట్టం ప్రారంభమైంది. మధ్యాహ్నాం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీరామునికి, సకల సుగుణాభిరాశి సీతమ్మకు వివాహాన్ని వైభవంగా జరిపించారు. ఈ కల్యాణ ఘట్టాన్ని సుదర్శనం సీతారామాచార్యులు చక్కగా వివరించారు. ఈ ఉత్సవాలకు జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ దంపతులు, ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు, ఎమ్మెల్యే మీసాల గీత దంపతులు, టిడిపి జిల్లా అధ్యక్షుడు మహంతి చిన్నంనాయుడు, టిడిపి జిల్లా ఉపాధ్యక్షుడు సువ్వాడ రవిశేఖర్, ఎంపిపి సువ్వాడ వనజాక్షి, మండల పార్టీ అధ్యక్షుడు గేదెల రాజారావు, ఎఎస్పీ ఎవి రమణ దంపతులు, ఉత్తరాంధ్ర సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద, ఉత్తరాంధ్ర సాధు సంత పరిషత్ అధ్యక్షుడు సమతానందస్వామి, రామానంద భారతి, విద్యానంద భారతి తదితరులు కల్యాణా న్ని వీక్షించారు. ఆలయ స్థానాచార్యులు ఖండవిల్లి సాయిరామాచార్యులు, గొడవర్తి రామనర్సింహాచార్యులు, ఖండవిల్లి కిరణ్ తదితరులు శాస్త్రోక్తంగా కల్యాణ మహోత్సవాన్ని జరిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీడీపీ జిల్లా ఉ పాధ్యక్షుడు సువ్వాడ రవిశేఖర్ ఏర్పాట్లను చేశారు. దేవాదాయశాఖ కమిషనర్ అనురాధ, డిప్యూటీ కమిషనర్ ఎన్‌విఎస్‌ఎన్ మూర్తి, ఆలయ ఎసి ఎస్‌ఎస్‌విఎస్‌స్ ప్రసాద్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా మంగళవారం శ్రీరాముల వారికి ఘనంగా పట్ట్భాషేకం నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.