రాష్ట్రీయం

భక్త జనసంద్రం.. సిరసనగండ్ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మార్చి 26: నాగర్ కర్నూల్ జిల్లా సిరసనగండ్లలో శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణం కమనీయంగా జరిగింది. నాల్గవ శతాబ్దంలో వెలసిన సిరసనగండ్ల శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయానికి భక్తులు వేలాది తరలివచ్చి సీతారాముల కల్యాణాన్ని కనులారా చూసి తన్మయం చెందారు. సీతారాముచంద్రుల కల్యాణోత్సవానికి ముఖ్య అతిథులుగా హోం శాఖమంత్రి నాయిని న ర్సింహారెడ్డి హాజరయ్యారు. స్వామివారి కల్యాణానికి పట్టువస్త్రాలను, తలంబ్రాలను అందజేశారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రభుత్వం తరపున అధికారికంగా స్వామివారికి పట్టువస్త్రాల ను అందజేసి స్వామివారి కల్యాణంలో పా ల్గొన్నారు. ఏటా సిరసనగండ్లకు భక్తులు వేలాదిగా తరలివస్తుండడంతో భారీ ఏర్పాట్లు చేశా రు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుం డా పోలీసులు, అధికారులు గట్టి చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా హోంమత్రి నాయి ని నర్సింహ్మారెడ్డి మాట్లాడుతూ శ్రీరామచంద్రు డి ఆశీస్సులతో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడు స్తోందని.. స్వామివారి ఆశీస్సులతో తెలంగాణ అభివృద్ధిలో దేశంలో ప్రథమ స్థానంలో నిలుస్తుందన్నారు. పోలీసుల బందోబస్తు ఏర్పాట్లు బాగున్నాయని, పోలీసులకు ప్రజల సహకా రం ఉంటేనే రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య ఉండదని అన్నారు.

చిత్రం..కల్యాణానికి పట్టువస్త్రాలను తీసుకొస్తున్న తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి