రాష్ట్రీయం

రుణ మాఫీకి బడ్జెట్‌లో రూ.4వేల కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పంట రుణాల మాఫీ మూడవ వాయిదా చెల్లించడానికి బడ్జెట్‌లో రూ. 4 వేల కోట్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మొత్తానికి అదనంగా సుమారు మరో నాలుగు వేల కోట్లు కేటాయిస్తే రాష్ట్రంలో పంట రుణాలన్ని మాఫీ అయిపోతాయి. అయితే ఒకే దఫా పంట రుణాలను మాఫీ చేయాలంటే బడ్జెట్‌లో సుమారు రూ. 8 వేల కోట్లు కేటాయించాల్సి ఉంటుంది. ఎలాగు హామీ ఇచ్చిన మేరకు ఒక్కో రైతు కుటుంబానికి లక్ష రూపాయల మేరకు పంట రుణాలను మాఫీ చేయడానికి ఇప్పటికే సుమారు 8 వేల కోట్లను బ్యాంకులకు విడుదల చేయడం జరిగింది.
తాజాగా వచ్చే నెలలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో మరో రూ. 4 వేల కోట్లు కేటాయిస్తే పంట పంట రుణాల మాఫీ కోసం రూ. 12 వేల కోట్లు బ్యాంకులకు విడుదల చేసినట్టు అవుతుంది. ఈ మొత్తాన్ని మినహాయిస్తే ఇక బ్యాంకులకు చెల్లించాల్సిన బకాయి కేవలం రూ. 4 వేల కోట్లు మాత్రమే మిగులుతుంది. తమ పార్టీ అధికారంలోకి వేస్తే ఒక్కో రైతు కుటుంబానికి లక్ష రూపాయల వరకు పంట రుణాన్ని మాఫీ చేస్తామని టిఆర్‌ఎస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ హామీని నిలబెట్టుకోవడానికి ఇప్పటికే దాదాపు రూ. 8 వేల కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం తాజాగా రాబోయే బడ్జెట్‌లో మరో రూ. 4 వేల కోట్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇంత మొత్తాన్ని బ్యాంకులకు తిరిగి చెల్లించిన ప్రభుత్వానికి మరో సుమారు మరో రూ. 4 వేల కోట్లు చెల్లిస్తే పంట రుణం మొత్తం మాఫీ చేసినట్టు అవుతుందన్న ప్రతిపాదనను కూడా ప్రభుత్వం తీవ్రంగా పరిశీలించింది. అయితే ఈ బడ్జెట్‌లో నీటిపారుదల రంగానికి రూ. 25 వేల కోట్లు కేటాయించడంతో పాటు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకం, మిషన్ భగీరథ వంటి ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలకు పెద్ద ఎత్తున నిధులు అవసరం అవుతాయి. ఒకే బడ్జెట్‌లో పంట రుణాల మాఫీకి రూ. 8 వేల కోట్లు కేటాయిస్తే మిగతా ప్రాధాన్యతా రంగాలకు నిధులు తగ్గించాల్సి వస్తుందని ఆర్థికశాఖ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజికానీ, ఎఫ్‌ఆర్‌బిఎం రుణ పరిమితి పెరిగిన పక్షంలో పంట రుణ మాఫీ తుది వాయిదాను కూడా బ్యాంకులకు చెల్లిస్తే సరిపోతుందని ప్రభుత్వం నిర్ణయించినట్టు అధికార వర్గాల సమాచారం.