రాష్ట్రీయం

కదం తొక్కండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: అవిశ్వాస తీర్మానం చర్చకు అవకాశం ఉండటంతో ఎంపీలు సభలో కదం తొక్కాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దేశంలోని అన్ని పార్టీల మద్దతు కూడగట్టడంలో విజయం సాధించిన మనం, రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయానికి సంబంధించిన వివరాలను అన్ని పార్టీలకూ అందించాలని సూచించారు. మంగళవారం అవిశ్వాసం చర్చ జరగవచ్చని సూచనప్రాయంగా వెల్లడించారు. సోమవారం టీడీపీ ఎంపీలు, వ్యూహ బృందంతో చంద్రబాబునాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మంగళవారం సభకు ఎంపీలు అందరూ విధిగా హాజరుకావాలి. అవిశ్వాసంపై చర్చకు పట్టుబట్టాలి. అవిశ్వాసం నోటీసులు టీడీపీ, వైసీపీతోపాటు కాంగ్రెస్, సీపీఎం కూడా ఇచ్చాయి. ఈ నేపధ్యంలో
లాటరీ ద్వారా అవిశ్వాసం చర్చకు చేపట్టే అవకాశం ఉంది. లేదా ముందు నోటీసు ఇచ్చిన పార్టీ అవిశ్వాసాన్ని చేపట్టవచ్చు. ఏదేమైనా అవిశ్వాసంపై చర్చను సద్వినియోగం చేసుకోవాలి. ఎంపీలంతా రాత్రికే ఢిల్లీకి చేరుకోవాలి. పసుపు చొక్కాలు, కండువాలతో సభకు హాజరు కావాలి. దేనికైనా సిద్ధంగా ఉండాలని ఎంపీలకు పిలుపునిచ్చారు. అన్నింటికి యూసీలు ఇచ్చాం కాబట్టే తరువాత విడత నిధులు ఇచ్చారనీ, యూసీలు ఇవ్వలేదు కాబట్టే నిధులు విడుదల చేయలేదనే బీజేపీ ఆరోపణల్లో వాస్తవం లేదని, దీన్ని తిప్పికొట్టాలన్నారు. పోలవరంపై మసూద్ కమిటీ నివేదిక గురించి ప్రస్తావించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న నివేదికలోని అంశాలను వివరించాలన్నారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని జాతీయస్థాయి అంశంగా మార్చామని, రాష్ట్రాన్ని ఒంటరి చేయాలనే బీజేపీ ప్రయత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఎంపీలకు సమాచారం అందించేందుకు ఏర్పాటు చేసిన రెండు బృందాలు ఢిల్లీ, అమరావతి నుంచి పని చేస్తాయన్నారు.