రాష్ట్రీయం

..రాజీనామాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 26: ప్రత్యేక హోదా చివరి అంకంలో భాగంగా రాజీనామాల అస్త్రాన్ని ప్రయోగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ నిర్ణయించింది. ముందుగా ప్రకటించిన ప్రకారం ఏప్రిల్ 6న పార్లమెంటు సమావేశాలు ముగిసేరోజున రాజీనామా చేయాల్సి ఉంది. అయితే
తెరాస, ఏఐఏడిఎంకెల ఆందోళన పేరిట అవిశ్వాస తీర్మానంపై చర్చించకుండా షెడ్యూల్ కంటే ముందుగా లోక్‌సభను నిరవధిక వాయిదా వేసిన పక్షంలో పార్టీ ఎంపీలు మూకుమ్మడిగా అదేరోజు స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా సమర్పించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. ప్రజాసంకల్ప పాదయాత్రలో భాగంగా గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన శ్రీరామనవమి సందర్భంగా సోమవారం యాత్ర వాయిదా వేసుకుని సత్తెనపల్లి నియోజకవర్గం పరిధిలోని చాగంటివారిపాలెంలో ప్రత్యేక శిబిరంలో పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. మంగళవారం నుంచి లోక్‌సభ, రాజ్యసభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. లోక్‌సభ సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, అవినాష్‌రెడ్డి, మిథున్ రెడ్డి, వరప్రసాద్‌తోపాటు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి హాజరైన సమావేశంలో సుమారు గంటన్నరకు పైగా వివిధ అంశాలపై చర్చించారు. మనం కొత్తగా కేంద్రాన్ని ఏం కోరటంలేదు. విభజన చట్టంలో ఉన్న అంశాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎంపీలు రాజీనామాకు సిద్ధం ఉన్నారని ఎప్పుడో ప్రకటించాం. మధ్యలో అవిశ్వాస తీర్మానం అడ్డువచ్చింది. దీనిపై చర్చకు కేంద్రం తావివ్వని నేపథ్యంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజీనామా చేస్తేనే మంచిదని జగన్ ప్రతిపాదించడంతో ఎంపీలు ఏకగ్రీవంగా ఆమోదించారు. అవిశ్వాసంపై చర్చకు అనుమతిస్తే ఇతర పార్టీల మద్దతు కూడగట్టండని ఎంపీలను ఆదేశించారు. అలాగే, టీడీపీ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేంద్రం ఉదాసీనత, చంద్రబాబు నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదని విమర్శించారు. నాలుగేళ్లు వౌనంగా ఉండి తమను అవహేళన చేశారని, మొదటి నుంచి ప్రత్యేక హోదా కోసం వైసీపీ డిమాండ్ చేస్తోందని గుర్తుచేశారు. చిత్తశుద్ది ఉంటే టీడీపీ ఎంపీలు కూడా తమతో పాటు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మూకుమ్మడి రాజీనామాలతో అయినా కేంద్రంలో కదలిక వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. లోక్‌సభలో కాంగ్రెస్ సభ్యులు 48, టీడీపీ, వైసీపీ కలిపి 25తో పాటు ఎస్పీ, బీఎస్పీ, వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్‌లు అవిశ్వాసానికి మద్దతు ప్రకటించాయని తెలిపారు. గుజరాత్, కర్నాటక ఉప ఎన్నికల ఫలితాలతో మోదీ ఇమేజి డ్యామేజీ అయిందనే తెలుగుదేశం పార్టీ వైదొలగిందని విమర్శించారు. కలిసొచ్చే పార్టీలతోనే నడుస్తామని స్పష్టం చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లోనే బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి తమకు ఆఫర్ వచ్చిందని ఇప్పుడు కొత్తగా ఎన్డీయేతో చీకటి ఒప్పందం చేసుకోవాల్సిన అగత్యం పార్టీకిలేదని ఖండించారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీలతో కలిసేది లేదని తేల్చిచెప్పారు. వామపక్షాలతో పాటు తమ పార్టీ అజెండాతో కలిసొచ్చే పార్టీల మద్దతు కూడగడతామన్నారు. ఇదిలా ఉండగా టీఆర్‌ఎస్, ఏఐఏడిఎంకెలకు ఎన్డీయే నచ్చచెప్పి అవిశ్వాసంపై చర్చకు తావిస్తే అనుసరించాల్సిన వ్యూహంపై కూడా వైసీపీ పార్లమెంటరీ సమావేశంలో చర్చకు వచ్చింది.