రాష్ట్రీయం

అడ్డుతగలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 26: కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి అడ్డుతగులబోమని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రకటించింది. అవిశ్వాసంపై చర్చ జరిగితే సహకరిస్తామని కూడా స్పష్టంచేసింది. ప్రగతి భవన్‌లో సోమవారం పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్టీ పార్లమెంటరీ సమావేశం జరిగింది. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. కొన్ని పార్టీలు కేంద్రంపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా తెరాస అడ్డుకుంటున్నట్టు వస్తున్న విమర్శల నేపథ్యంలో తెరాస ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇవ్వకముందు నుంచే రిజర్వేషన్లపై రాష్ట్రాలకే అధికారం ఇవ్వాలన్న డిమాండ్‌తో పార్లమెంట్‌లో ఆందోళన కొనసాగిస్తున్నామని పార్లమెంటరీ పార్టీ భేటీ అనంతరం ఎంపీలు జితేందర్‌రెడ్డి, కె కేశవరావులు ఇతర ఎంపీలతో కలిసి మీడియాకు వెల్లడించారు. కేంద్రంపై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని టిఆర్‌ఎస్ అడుకుంటుందన్న రాజకీయ పక్షాల ప్రచారాన్ని ఖండించారు. రిజర్వేషన్లపై తాము చేస్తున్న న్యాయబద్ధమైన నిరసనను కేంద్రం సాకుగా చూపిస్తూ స్వప్రయోజనాలకు వాడుకుంటుందని ఎంపీ కేశవరావు ఆరోపించారు. అవిశ్వాస తీర్మానంపై సభలో వాయిదాల పరంపర కొనసాగడంవల్ల చర్చకు రాకపోవడంతో కొన్ని పార్టీలు తమ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. ఇకనుంచి తమపై అపవాదుకు ఆస్కారం లేకుండా అవిశ్వాసంపై చర్చకు సహకరించేందుకు పార్టీ నిర్ణయంచిందన్నారు. ఇకపై తాము ప్లకార్డులతో వెల్‌లోకి వెళ్లకుండానే నిరసనను కొనసాగిస్తూ, అవిశ్వాసంపై చర్చకు అవకాశం వస్తే తమ రిజర్వేషన్ల డిమాండ్‌పై మాట్లాడుతామన్నారు. పార్లమెంట్‌లో పార్టీ నాయకుడు ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఉండాలన్నారు. ఈ అంశంపై సీఎం కేసీఆర్ స్వయంగా ప్రధాని దృష్టికి తీసుకెళ్లినా నాలుగేళ్లుగా కేంద్రం ఎటూ తేల్చడం లేదన్నారు. రాష్ట్రంలో రిజర్వేషన్ల అంశాన్ని తొమ్మిదవ షెడ్యూల్‌లో చేర్చాలని తెరాస డిమాండ్ చేస్తుందన్నారు. ఎంపి వినోద్‌కుమార్ మాట్లాడుతూ విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేయడం లేదన్నారు. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్నప్పుడు తెలంగాణలో ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. తమకే కాకుండా ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలకూ మద్దతిచ్చామని గుర్తు చేశారు. కేంద్రం వైఖరి దున్నపోతుపై వర్షం కురిసినట్టుగా ఉందని ఎంపి కవిత దుయ్యబట్టారు. విభజన తర్వాత రాష్ట్రంలో గిరిజనులు, మైనార్టీల జనాభా పెరిగిందని, దానికి అనుగుణంగా రిజర్వేషన్ల శాతాన్నీ పెంచాలని న్యాయబద్ధంగా డిమాండ్ చేస్తున్నామని కవిత వివరించారు.