రాష్ట్రీయం

వ్యూహం మార్చిన బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 26: కేంద్రంపై పోరాడుతున్న సీఎం చంద్రబాబు అనూహ్య నిర్ణయం తీసుకుని బీజేపీకి షాక్ ఇచ్చారు. హోదా, ప్యాకేజీ సహా రాష్ట్రానికి రావలసిన హక్కులపై చర్చించేందుకు అన్ని రాజకీయ పార్టీలు, హోదా కోసం పోరాడుతున్న సంఘాలు, సంస్థలతో మంగళవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ భేటీ తర్వాత అందరినీ ఢిల్లీకి తీసుకువెళ్లి, హోదాను జాతీయస్థాయిలో చర్చనీయాంశం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో హోదా, ప్యాకేజీ సహా విభజన చట్టం హామీలు అమలుచేయాలని కోరుతున్న అందరినీ ఒకే తాటిపైకి తీసుకురావాలని కృషి చేస్తున్నారు. రాజకీయంగా తనతో విభేదిస్తున్న ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్, వామపక్షాలతోపాటు ప్రత్యేక హోదా సాధన సమితి ఇతర సంఘాలనూ మంగళవారం సచివాలయంలో ఉదయం 11 గంటలకు ఏర్పాటుచేయనున్న అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించారు. రాష్ట్రంలోని ఒక్కో రాజకీయపార్టీ, సంఘం నుంచి ఇద్దరు ప్రతినిధులను ఆహ్వానించారు.
వ్యూహాత్మకంగానే అఖిలపక్షం
మంగళవారం పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉన్నందున, అదేరోజు రాష్ట్రంలోని అన్ని పార్టీలు, సంఘాలతో అఖిలపక్షం నిర్వహించడం ద్వారా హోదా, విభజన హామీల అమలు, హక్కుల సాధనపై రాష్టమ్రంతా ఒకే గళంతో ఉందన్న సంకేతాలను కేంద్రానికి పంపించే వ్యూహంతో ఉన్నారు. ఇదే సమావేశంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఒక తీర్మానం కూడా ఆమోదించి, దానిని కేంద్రానికి పంపించాలని నిర్ణయించినట్లు సమాచారం.