రాష్ట్రీయం

ఏవోబీలో తుపాకుల మోత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో మళ్లీ యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఏవోబీలో మళ్ళీ తుపాకీల మోత వినిపించింది. ఆంధ్ర -ఒడిశా ప్రభుత్వాల జాయింట్ ఆపరేషన్, కూంబింగ్ నిరంతరం సాగుతునే ఉంది. అయినప్పటికీ, ఆదివారం రాత్రి నలుగురు మావోయిస్టులు కొరాపుట్ జిల్లా వలంటరీ ఫోర్స్ (డీవీఎఫ్) కాల్పుల్లో మృతి చెందారు. కొరాపుట్ జిల్లా నారాయణపట్నం సమీపంలో డోక్రాఘాట్ ప్రాంతంలో ఈ సంఘన జరిగింది. డీవీఎఫ్ ప్రత్యేక గాలింపుల్లో భాగంగా జరుపుతున్న కూంబింగ్‌లో చత్తీష్‌ఘడ్ నుంచి భారీగా ఆయుధాల తరలింపు జరుగుతోందంటూ ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరికలతో మావోలు - డీవీఎఫ్‌ల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. సోమవారం ఉదయం భారీగా స్వాధీనం చేసుకున్న ఆయుధాలను చూపిస్తూ కొరాపుట్ ఎస్పీ కేవీసింగ్ విలేఖరుల సమావేశంలో ఎన్‌కౌంటర్ వివరాలు వెల్లడించారు. మృతి చెందిన మావోయిస్టుల్లో చత్తీష్‌గడ్‌కు చెందిన ఉన్ఘీ అలియాస్ హారతిగా గుర్తించిన పోలీసులు ఆమె తలపై రూ. 4 లక్షల రివార్డు ఉందన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన వారిలో మరో ముగ్గురు వివరాలు ఇంకా తెలియరాలేదు. కానీ, ఎవోబీయే సేఫ్‌జోన్‌గా ఎంచుకుని చత్తీస్‌గఢ్
నుంచి భారీగా తరలించే ఆయుధాల్లో ఐఎన్‌ఎస్‌ఎఎస్, 4 ఎస్‌ఎల్‌ఆర్ రైఫిల్స్, 303 రైఫిల్స్, 169 రౌండ్స్‌తోపాటు పదివేల రూపాయల నగదు మృతి చెందిన మావోల ప్రాంతం నుంచి కొరాపుట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా సోమవారం కొరాపుట్ ఎస్పీ సింగ్ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ చాలాకాలం తరుత ఎవోబీలో మావోల కదలికలు కన్పించాయని, తమతోపాటు భారీగా ఆయుధాలు తరలిస్తున్న నేపథ్యంలో ఏవోబీలో గల శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. అయితే, శ్రీకాకుళం జిల్లాలో తూర్పుకనుముల గుండా చత్తీష్‌ఘడ్ నుంచి రాకపోకలు చేసే మావోల రహదారులన్నీ మూసుకుపోయాయంటూ ఇటీవలే జిల్లాకు వచ్చిన రాష్ట్ర పోలీస్ బాసు సుస్పష్టం చేసారు. మావోల కదలికలే ఎవోబీలో లేవంటూనే ఆంధ్రా - ఒడిశా పోలీసులు జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా కూబింగ్ నిర్వహించడం బహిరంగ రహస్యం. అయితే, ఆదివారం రాత్రి డోక్రాఘాట్ వద్ద జరిగిన ఈ ఎన్‌కౌంటర్ మళ్ళీ శ్రీకాకుళం జిల్లాలో వణుకు పుట్టిస్తోంది. విశాఖ ఏజెన్సీలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌కు ప్రతీకార చర్యలు ఇంకా మావోలు ముగించకముందే మరో ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోలను హతమార్చిన డీవీఎఫ్ టీంపై ప్రతీకార చర్యలు తీర్చుకునే అవకాశాలు లేకపోలేదంటూ ఒడిశా పోలీసులు భావిస్తున్నారు. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఎస్పీ త్రివిక్రమవర్మతో కొరాపుట్ ఎస్పీ సింగ్ సోమవారం రాత్రి మాట్లాడినట్టు సమాచారం. ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో పక్కపక్క జిల్లాల పోలీసుబాస్‌ల మధ్య జరిగే ఆపరేషన్ ఎవోబీ మరింత పటిష్టంగా నిర్వహించేందుకు ప్రత్యేక బలగాలు ఎవోబీకి మరికొద్ది గంటల్లో చేరుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో సేఫ్టీజోన్లుగా ఉన్న తూర్పుకనుములు, తువ్వాకొండలు, మహేంద్రగిరులపై కేంద్ర ప్రత్యేక పోలీసు బలగాలు మోహరింపునకు గ్రీన్‌సిగ్నెల్ ఇచ్చినట్టు సమాచారం. ఏది ఏమైనప్పటికీ ఒడిశాలోని కొరాపుట్ బ్లాక్‌లో జరిగిన ఎన్‌కౌంటర్ శ్రీకాకుళం జిల్లాలో రెడ్ అలర్ట్‌కు దారితీసింది.
చిత్రం..ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మహిళా మావోయిస్టులు