రాష్ట్రీయం

వాళ్లను నమ్మలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన, విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలుపై వామపక్షాలతో కలిసి జనసేన పార్టీ ఐక్య పోరాటం చేస్తుందని, జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ ప్రకటించారు. ప్రత్యేక హోదాపై తెలుగుదేశం పార్టీ మాటలు మారుస్తోందని, బీజేపీ ఏ మాత్రం పట్టించుకోవడం లేదని, వైసీపీ బలంగా పోరాటం చేయలేకపోతోందని అన్నారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ సిపిఎం, సిపిఐ నాయకులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన పార్టీ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడారు. పవన్‌కళ్యాణ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రతిసారీ రాజీ ధోరణితో వ్యవహరిస్తోందని, ఇంత కాలం పనిచేయని వారు ఇపుడు చేస్తారనే నమ్మకం లేదని అన్నారు. అనేక మార్లు మాటలు మార్చారని, ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు మొదటి బడ్జెట్‌లో మాట్లాడితే రాజకీయాలు చేస్తున్నారని అంటారని అని చెబుతూ మాటలు మార్చారని అన్నారు. ప్రత్యేక హోదా అవసరమా అని ఒక సారి చెప్పారని, టీడీపీ రాజీ వైఖరి వల్ల రాష్ట్ర ప్రజలకు తీవ్రమైన నష్టం జరిగిందని, ఈ విషయంలో వైసీపీ స్పందన నామమాత్రంగానే ఉందని, జనసేన పక్షాన తిరుపతి సభలో ప్రత్యేక హోదా ఏమైందని ప్రశ్నించామని, వెంటనే ప్యాకేజీ ప్రకటించారని, దానికి చట్టబద్థత కల్పించలేదని అన్నారు. అధికారం ఉన్న వాళ్ల తీరు వల్ల యువతకు ఉద్యోగావకాశాలు రాలేదని, రైతులకు గిట్టుబాటు ధర లభించలేదని, వెనుకబడ్డ శ్రీకాకుళం లాంటి జిల్లాల్లో పుట్టిన వెయ్యి మంది చిన్నారుల్లో 50 మంది ఏడాదిలోపే చనిపోతున్నారని అన్నారు. ప్రతిదానికీ ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్నాం అని అంటున్నారని, పుష్కరాల పేరుతో ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారని, దానిపై అడిగినా స్పందన లేదని అన్నారు. రాజధాని అమరావతి ఒక సమ్మిళిత రాజధాని నగరంలా రూపుదిద్దుకోవడం లేదని, అమరావతిని తెలుగు పార్టీకి అనుబంధ నగరంలా తయారుచేస్తున్నారని ఆరోపించారు. ఉత్తరాంధ్ర నుండో రాయలసీమ నుండో వచ్చి ఇమిడిపోయే పరిస్థితులు కనిపించడం లేదని అన్నారు. ఇది సమ్మిళిత రాజధాని కాదు, కొందరికే ప్రత్యేకించిన రాజధాని , ఎవరైనా చట్టానికి లోబడి ఉండాల్సిందే, తాము ఉన్నతం అనుకుంటే కుదరదు అని వ్యాఖ్యానించారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా లేఖ ఆయన వ్యక్తిగత హోదాలో రాసిందే తప్ప కేంద్ర ప్రభుత్వం తరఫున రాసింది కాదని అన్నారు. దానిపై స్పందించేది ఏమీ లేదని చెప్పారు. ఇపుడు వైకాపా ఎంపీల రాజీనామాలు వల్ల ప్రయోజనం ఏముంటుందని నిలదీశారు. అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు తీసుకురావడం లేదని, చిత్తశుద్ధి లేని ప్రకటనలు అవి, తొలి నుండి టీడీపీ, వైకాపాలు బలంగా పోరాడలేదని, జనసేన, సిపిఎం, సిపిఐలు కలిసి ఐక్య పోరాటం చేస్తాయని అన్నారు. సిపిఎం కార్యదర్శి మధు మాట్లాడుతూ రాజధాని లేదు, పరిశ్రమలు హైదరాబాద్‌లో ఉన్నాయి, ఉపాధి అవకాశాలు లేవు, రైతులకు గిట్టుబాటు ధర లేదని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ అనేక కష్టాల్లో ఉందని, రైల్వే జోన్ ఇవ్వలేదని, చట్టంలో చెప్పిన విధంగా రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్యాకేజీ రాలేదని, టీడీపీ, బీజేపీ కలిసి నాటకాలు ఆడుతున్నాయని, ప్రత్యేక హోదా సాధన, విభజన హామీల అమలుకోసం జనసేన, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని నిర్ణయించాయని అన్నారు. సిపిఐ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్యాయం జరిగిందని చెబుతున్నా, మోదీ ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు. నాలుగేళ్లుగా కేంద్రంతో లాలూచీపడి, ఇపుడు ఉద్యమం చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని తనని విమర్శిస్తే రాష్ట్రం బలహీనపడుతుందని అనడం విడ్డూరమని అన్నారు. అధికార ప్రతిపక్షాలు మోదీతో లాలూజీపడ్డాయని, హోదా సాధన, విభజన చట్టంలో హామీల అమలుకోసం ఏప్రిల్ నుండి పోరాటాలు మొదలవుతాయని అన్నారు. తొలుత అనంతపురం నుండి ప్రారంభిస్తామని, ఆ తర్వాత విశాఖ, ఒంగోలులో చేస్తామని, రాష్టమ్రంతా విస్తరింప చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో అవినీతి జరిగితే బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని తగుదునంటూ ఇప్పుడు విమర్శిస్తున్నారా? అని అన్నారు.