రాష్ట్రీయం

ఏజీ రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ దేశాయి ప్రకాశ్‌రెడ్డి రాజీనామా చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఆయన రాజీనామాపై ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వ వర్గాల సమాచారం. శాసనసభలో కాంగ్రెస్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ల సభ్యత్వ రద్దుపై హైకోర్టులో విచారణకు వచ్చినప్పుడు ప్రకాశ్‌రెడ్డి ప్రభుత్వ వాదనను సరిగ్గా వినిపించలేదని ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేయడం వల్లనే మనస్థాపంతో రాజీనామా చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ కేసుపై హైకోర్టులో తదుపరి విచారణ సమయంలో ప్రభుత్వ వాదనలు వినిపించడానికి తనను కాదని సుప్రీం కోర్టు న్యాయవాది ఒకరిని పిలిపించనున్న సమాచారంతో ప్రకాశ్‌రెడ్డి రాజీనామా చేసినట్టు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ తొలి అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి పదవీకాలం ముగిసిన తర్వాత 8 నెలల కిందట ప్రకాశ్‌రెడ్డి నియామకమైన విషయం తెలిసిందే.