రాష్ట్రీయం

ఏముందని వస్తారు!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 27: శాసనసభలో చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ వద్ద ‘సరకు’ లేదని, అందువల్ల సభలకు రాకూడదని ప్రణాళిక సిద్ధం చేసుకుని గవర్నర్‌పై దాడికి పాల్పడ్డారని సీఎం కే. చంద్రశేఖరరావు ఆరోపించారు. శాసనసభలో ద్రవ్యవినిమయ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడుతూ గవర్నర్‌ను కొట్టాలని కాంగ్రెస్ ప్రణాళిక రూపొందించుకున్నారని అంటూ, గవర్నర్‌ను కొడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర గౌరవానికి ఎవరు భంగం కలిగించినా సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం చేపట్టిన ఏ కార్యక్రమంపై అయినా చర్చించేందుకు సిద్ధమని, సభను ఎన్నిరోజులైనా నడిపించేందుకు అభ్యంతరం లేదన్నారు. పద్దులేవీ ‘గెలిటిన్’ కానివ్వబోమన్నారు. రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించేందుకు తాను కట్టుబడి ఉన్నానని కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీటిని అందించేందుకు వీలుగా వివిధ నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మిస్తున్నామన్నారు. జాతీయ రహదారుల అంశంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పూర్తిగా సహకరిస్తున్నారన్నారు. 2014 నాటికి తెలంగాణలో 2500 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉండగా, గత నాలుగేళ్లలో మరో 3174 కిలోమీటర్లకు గుర్తింపు లభించిందన్నారు.
పరిపాలనా వికేంద్రీకరణకు కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటు చేశామని కేసీఆర్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్లు, జిల్లా కార్యాలయ భవనాల నిర్మాణం జరుగుతోందని, ఈ ఏడాది చివరినాటికి పూర్తవుతాయన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు ఆఫీస్-కం-రెసిడెన్స్ భవనాలు నిర్మిస్తున్నామని, జాతీయ పండగలైన పంద్రాగస్టు, చబ్సీస్ జనవరీకి ఈ భవనాలవద్ద ఎమ్మెల్యేలే జాతీయ పతాకాలు ఎగరవేస్తారన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాకంటే ప్రోటోకాల్‌లో ఎక్కువగా ఉండే ఎమ్మెల్యేలకు కనీస గౌరవం ఉండాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమన్నారు.
సంక్షేమ కార్యక్రమాల అమల్లో తెలంగాణ దేశంలోనే టాప్‌లో ఉన్నదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కల్యాణలక్ష్మికి గతంలో 51 వేల రూపాయలు ఇస్తుండగా, ఇప్పుడు 1,00,116 రూపాయలు ఇస్తున్నామన్నారు. బీడికార్మికులు, ఒంటరిమహిళలు, బోదకాల బాధితులు, గీతాకార్మికులు తదితరుల జీవనం కోసం సంక్షేమ పింఛన్ ఇస్తున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు గతంలో కనీస వేతనం 12 వేల రూపాయలు ఉండగా, ఇప్పుడది 40 వేలకు పెంచామన్నారు.
అందరికీ వైద్య పరీక్ష
హెల్త్ ప్రొఫైల్ ఆఫ్ తెలంగాణ స్టేట్ పేరుతో రాష్ట్రంలోని ప్రతి ఒక్క వ్యక్తికి ఏటా ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని సిఎం తెలిపారు. బ్రిటన్, కెనడా దేశాల్లో ఈ విధానం అమల్లో ఉందని, అందుకే అధ్యయనం కోసం ఉన్నతస్థాయి బృందాన్ని త్వరలో కెనడా పంపిస్తామన్నారు. గర్భిణీ మహిళలు, దవాఖానాల్లో ప్రసవాలు జరిగితే ఇస్తున్న కేసీఆర్ కిట్స్‌ను వివిధ రాష్ట్రాలు యథాతథంగా అమలు చేస్తున్నాయన్నారు. ప్రజారోగ్యం మెరుగైందని, దవాఖానాల్లో ఔట్‌పేషెంట్లు, ఇన్‌పేషెంట్ల సంఖ్య భారీగా పెరిగిందన్నారు. మరో ఎనిమిది నెలల్లో అందరికీ కంటిపరీక్షలు నిర్వహిస్తామని, అవసరమైన వారికి కాటరాక్ట్ ఆపరేన్లు ఉచితంగా చేయిస్తామన్నారు. తెలుగు భాషకు పట్టం కట్టేందుకే ప్రపంచ తెలుగు మహాసభలను ఇటీవల ఘనంగా
నిర్వహించామని సిఎం తెలిపారు. భూరికార్డుల ప్రక్షాళన విజయవంతమైందన్నారు. రైతుబంధు పథకం కింద ఎనిమిది వేల రూపాయలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నామన్నారు. రైతులందరికీ ఐదులక్షల రూ.ల బీమా సదుపాయం కల్పిస్తున్నామని వెల్లడించారు.