రాష్ట్రీయం

పీఆర్‌కు కొత్త చట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం లభించినప్పటికీ కొత్త పంచాయతీరాజ్ చట్టం ఆమోదానికి బుధ, గురువారం రెండు రోజుల పాటు సభ కొనసాగనుంది. కొత్త పంచాయతీరాజ్ చట్టం ముసాయిదా బిల్లును సభలో ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టబోతుంది. ఈ బిల్లుపై సభలో గురువారం చర్చించి ఆమోదించాక చట్టంగా మారనుంది. కొత్త పంచాయతీరాజ్ చట్టం ద్వారా సర్పంచ్‌లకు పూర్తి స్వేచ్ఛ, అధికారాలు లభించేలా చట్టాన్ని ప్రభుత్వం రూపొందించింది. సర్పంచ్‌ను సర్వ స్వతంత్రుడిని చేసేలా పూర్తి అధికారాలు కల్పించడమే కాకుండా బాధ్యతగా వ్యవహరించని పక్షంలో పదవీచ్యుడ్ని చేసే అధికారం ప్రభుత్వం కలిగి ఉండటం చట్టంలో కీలకమైన అంశంగా అధికార వర్గాల సమాచారం. ప్రస్తుత పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామ సభలను ఏడాదికి రెండుసార్లు తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉంది. కొత్త చట్టం ప్రకారం ఇకనుంచి ప్రతీ రెండు నెలలకోసారి తప్పనిసరిగా గ్రామ సభలను నిర్వహించాలని ముసాయిదా చట్టంలో పేర్కొన్నట్టు సమాచారం. నిధులు, విధులలో సర్పంచ్‌లకే పూర్తి కార్యనిర్వహక అధికారాలను కల్పిస్తున్నట్టు ముసాయిదా బిల్లులో పేర్కొన్నట్టు తెలిసింది. మండల పరిషత్, జిల్లా పరిషత్‌లలో కో-ఆప్షన్ సభ్యులను నియమించే విధానం కొనసాగుతుంది. ఇదే మాదిరిగా గ్రామ పంచాయతీల్లో కూడా ఇక నుంచి కో-ఆప్షన్ సభ్యులను నిమించుకునే అవకాశాన్ని కొత్త పంచాయతీరాజ్ చట్టంలో కల్పించినట్టు తెలిసింది. కొత్త చట్టంపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫారసు చేయడానికి ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం కూడా ఈమేరకు సిఫారసు చేసినట్టు సమాచారం. సర్పంచ్‌లు మరింత ఎక్కువ సమయం, దృష్టి కేంద్రీకరించడానికి గౌరవ వేతనాన్ని కూడా రెండు రెట్లు పెంచినట్టు తెలిసింది. ప్రస్తుతం సర్పంచ్‌లు గౌరవ వేతనంగా నెలకు రూ. 5 వేలు పొందుతుంటే, ఇకనుంచి దీనిని మూడింతలు పెంచి రూ. 15 వేలుగా ముసాయిదాలో పేర్కొన్నట్టు తెలిసింది. గ్రామ పంచాయతీకి కేంద్రం, రాష్ట్రంనుంచి వచ్చే నిధులు, గ్రాంట్లను వినియోగించుకోవడంలో గ్రామ కార్యదర్శి సంతకం లేకుండానే సర్పంచ్‌లకే అధికారాన్ని కట్టబెట్టినట్టు తెలిసింది. గ్రామ స్వరాజ్యం సాకారం కావడంతో పాటు స్థానిక పాలనకు కొత్తరూపు తీసుకరావాలన్న సంకల్పంతో ఈ చట్టాన్ని రూపొందించినట్టు మంత్రివర్గ ఉప సంఘం ఇదివరకే ప్రకటించింది.