రాష్ట్రీయం

పట్ట్భాషిక్తుడైన జగదభిరాముడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మార్చి 27: కల్యాణరాముడు.. రారాజుగా మారాడు. రాజాధిరాజుగా కీర్తిప్రతిష్ఠలు అందుకున్నాడు. జగదభిరాముడైన శ్రీరాముడు శ్రీరామరాజ్యానికి మహారాజుగా పట్ట్భాషిక్తుడయ్యాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శ్రీరామనవమి నాడు పసుపు వస్త్రాలతో సీతా సమేతంగా దర్శనమిచ్చిన కల్యాణరాముడు మంగళవారం వజ్రాల కిరీటం ధరించి మహారాజుగా దర్శనమిచ్చాడు. భక్తుల జయజయ ధ్వానాలతో భద్రాద్రి మార్మోగగా.. రుత్వికుల వేద మంత్రోచ్ఛారణలతో భక్తులు ఆధ్యాత్మిక చింతనలో మునిగితేలగా.. దశరథ తనయుడు శ్రీరాముడి పట్ట్భాషేక మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. నేత్రపర్వంగా సాగిన శ్రీరాముని పట్ట్భాషేకాన్ని తిలకించిన భక్తజనం ఈ జన్మకు ఇది చాలన్నట్లుగా మదినిండా రామయ్యను నింపుకున్నారు. గవర్నర్ పంపించిన పట్టువస్త్రాలతో పాటు చినజీయర్‌స్వామి రామచంద్రుడికి పట్టువస్త్రాలు సమర్పించారు. అంతకుముందు రామపాదుకలను ఆలయ అధికారులు శిరస్సుపై ధరించి పట్ట్భాషే కం జరుగుతున్న మిథిలా స్టేడియానికి చేరుకున్నారు. ప ట్ట్భాషేక క్రతువును జీయర్‌స్వామి ఆద్యంతం తిలకించా రు. రామదాసు వారసులు కంచర్ల శ్రీనివాస్ కూడా స్వామి కి పట్టువస్త్రాలు అందించారు.
పట్ట్భాషేకం జరిగిందిలా..
పట్ట్భాషేకం సందర్భంగా ఆలయాన్ని తెల్లవారుజామున 4 గంటలకు తెరిచారు. ముందుగా సుప్రభాత సేవ, ఆరాధన, బాలభోగం, నివేదన, సేవాకాలం, బలిహరణం, మంగళాశాసనం నిర్వహించారు. ఉదయం 6 గంటలకు దేవస్థానం నాదవిద్వాంసులచే కచేరీ నిర్వహించారు. అనంతరం భద్రుని మండపంలో రామపాదుకలకు అభిషేకం నిర్వహించారు. 9 గంటలకు అలంకరణ చేశారు. నదీ, స ముద్ర జలాలున్న కలశాలను రుత్వికులు శిరస్సుపై పెట్టుకుని కల్యాణ మండపానికి బయలుదేరారు. గర్భగుడిలో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తుల జయజయధ్వానాల నడుమ ఊరేగింపుగా మిథిలా స్టేడియానికి తీసుకొచ్చారు. 10.30 గంటలకు పట్ట్భాషేక మహోత్సవం ప్రారంభం కాగా విశ్వక్సేన పూజ, పుణ్యహవచనం నిర్వహించి పూజలకు ఉపయోగించే ద్రవ్యాలకు సంప్రోక్షణ చేశారు. రుత్వికులకు వస్తధ్రారణ చేసి నదీజలాలతో మండపాన్ని సంప్రోక్షణ చేశారు. స్వామికి రామదాసు చేయించిన పచ్చల పత కం, చింతాకు పతకం, రాజముద్రికను సమర్పించి, ఖడ్గం, రామమాడ, సుదర్శన చక్రం, శంఖు చక్రాలు, ముత్యాలహారం, కిరీటాన్ని ధరింపజేశారు. అనంతరం స్వామికి నదీజలాలతో సంప్రోక్షణ చేశారు. ఆ జలాలను భక్తులపై చల్లారు. పట్ట్భాషేక విశిష్టతను అర్చకులు భక్తులకు వివరించారు.

చిత్రం..భద్రాద్రిలో శ్రీరామచంద్రుడు పట్ట్భాషేక మహోత్సవం నిర్వహిస్తున్న దృశ్యం