రాష్ట్రీయం

వైభవంగా అప్పన్న కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, మార్చి 27: ప్రహ్లాద వరదుడు, జగద్రక్షకుడైన వరాహ నారసింహుడి తిరుకల్యాణమహోత్సవం మంగళవారం సింహగిరిపై అంగరంగ వైభవంగా జరిగింది. భక్త కోటి హరినామస్మరణ మధ్య వేద పండితులు మంత్రాలు వల్లిస్తుండగా నాదస్వర వాయిద్యాల నడుమ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారు శ్రీదేవి,్భదేవులను పరిణయమాడారు. అస్థానాచార్యులు డాక్టర్ టీపీ రాజగోపాల్ పర్యవేక్షణలో ఇన్‌చార్జి ప్రధానార్చకుడు ఐవీ రమణమూర్తి సారథ్యంలో దేవాలయ అర్చక పరివారం ఆగమశాస్త్రానుసారం స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. సనాతనంగా వస్తున్న ఆచారాన్ని అనుసరించి దేవాలయ అనువంశిక ధర్మకర్తలైన పూసపాటి వంశీయులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. రథోత్సవం... కల్యాణోత్సవంలో భాగంగా ముందు రథోత్సవం జరిగింది. శ్రీమహాలక్ష్మీ తోబుట్టువులుగా కీర్తించే గంగపుత్రులైన జాలర్లు వధువరులను కల్యాణ వేదికకు తోడ్కొని వచ్చే బాధ్యతలను స్వీకరించారు.దేవాలయంలో కొట్నాల ఉత్సవం, ధ్వజారోహణం, ఎదురుసన్నాహ ఉత్సవాలను పూర్తి చేసిన తరువాత అర్చకులు గోవిందరాజుస్వామి వారిని, అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకువచ్చి రథం పై వేంచింపజేసారు. ఉభయదేవేరుల సమేతంగా రథం పై ఆశీనులై ఉన్న సింహగిరి నరహరిని జాలర్ల పెద్ద నిర్దేశకత్వంలో గంగపుత్రులు, భక్తులు కల్యాణ వేదికకు చేర్చారు. పుష్పమాలికలతో సుందరంగా అలంకరించిన వేదిక పై స్వామివారిని అమ్మవార్లను ఆశీనులను చేసి అర్చకులు కల్యాణం జరిపించారు. కల్యాణోత్సవం సందర్భంగా ఈవో రామచంద్రమోహన్ ఆధ్వర్యంలో దేవస్థానం అధికారులు భారీ ఏర్పాట్లు చేసారు. ఉత్తరాంధ్రతో పాటు ఉభయగోదావరి జిల్లాల నుండి వేలాదిగా భక్తులు తరిలివచ్చి కల్యాణం తిలకించి తరించారు. కల్యాణం అనంతరం భక్తులకు అక్షింతలు, ముత్యాల తలంబ్రాలు, లడ్డూ ప్రసాదాలను దేవస్థానం ఉచితంగా పంపిణీ చేసింది. సౌత్ ఏసిపి అర్చున్ సారధ్యంలో వివిద స్థాయిల్లో సుమారు మూడువందల మంది పోలీసులు ఉత్సవంలో భద్రతను పర్యవేక్షించారు. కల్యాణం అనంతరం భక్తులను గమ్యాలకు చేర్చేందుకు దేవస్థానంతో పాటు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపింది. రాష్ట్రం నలుమూలల నుండి తరలి వచ్చిన రాజకీయ, అధికార ప్రముఖులు స్వామివారి కల్యాణంలో పాల్గొన్నారు.