రాష్ట్రీయం

జీశాట్-6ఏ ప్రయోగం రేపే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, మార్చి 27: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సమాచార రంగంలో ముందడుగు వేసేందుకు మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో కమ్యూనికేషన్ రంగానికి చెందిన జీశాట్-6ఏ ఉపగ్రహాన్ని రూపొందించి ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి గురువారం సాయంత్రం 4గంటల 56నిమిషాలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 08 రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. ప్రయోగ సన్నాహాల్లో భాగంగా మంగళవారం షార్‌లోని బ్రహ్మప్రకాష్ హాలులో డాక్టర్ బిఎన్.సురేష్ అధ్యక్షతన జరిగిన మిషన్ రెడీనెష్ రివ్యూ సమావేశంలో (ఎంఆర్‌ఆర్) శాస్తవ్రేత్తలు పాల్గొని ప్రయోగం పై సుదీర్ఘంగా చర్చించారు. ఎంఆర్‌ఆర్ అనంతరం షార్ డైరెక్టర్ పి.కున్హికృష్ణన్ ఆధ్వర్యంలో లాంచింగ్ ఆథరైజేషన్ బోర్డు (ఎల్‌ఎబి)సమావేశమై ప్రయోగానికి సంసిద్ధత తెలిపారు. ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ 27గంటలు ముందు అనగా బుధవారం మధ్యాహ్నం 1:56గంటలకు ప్రారంభం కానుంది. కౌంట్‌డౌన్ సజావుగా 27గంటలు కొనసాగినంతరం జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 08 రాకెట్ షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుండి నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లనుంది. 2140కిలోల బరువుగల జీశాట్-6ఎ కమ్యూనికేషన్ శాటిలైట్‌ను ఈ రాకెట్ ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. సమాచార వ్యవస్థను మరింత మెరుగుపరడానికి ఇస్రో ఈ ఉపగ్రహాన్ని రూపొందించి ప్రయోగిస్తోంది. ఇది విజయవంతమైతే 12సంవత్సరాల పాటు సేవలు అందించనుంది. 49 మీటర్ల ఎత్తు 415టన్నుల బరువుగల జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 08 రాకెట్‌ను శాస్తవ్రేత్తలు మూడు దశల్లో ప్రయోగించనున్నారు. రాకెట్ భూమి నుంచి ఎగిరిన అనంతరం 17నిమిషాల 46సెకన్లకు భూమికి దగ్గరగా (పెరిజి) 170కి.మీ దూరంలో భూమికి దూరంగా (అపోజి) 35,975కి.మీ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి చేర్చనుంది. జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల పరంపరంలో ఇది 12వది కాగా స్వదేశీ క్రయోజనిక్ ప్రయోగాల్లో 6వది కావడం విశేషం. ప్రయోగ నేపధ్యంలో ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ బుధవారం షార్‌కు రానున్నారు. షార్‌కు చేరుకున్నంతరం ఆయన కౌంట్‌డౌన్ ప్రక్రియను పరిశీలించి శాస్తవ్రేత్తలతో సమావేశమై ప్రయోగ వివరాలడిగి తెలుసుకోనున్నారు. అనంతరం చెంగాళమ్మ ఆలయానికి చేరుకుని రాకెట్ విజయం కోసం పూజలు చేయనున్నారు.